విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ నుంచి లీకై గాలిలో కలిసి ప్రాణాంతకంగా మారిన రసాయన వాయువు తీవ్రత తగ్గించేందుకు అవసరమైన రసాయనాలను గుజరాత్ సర్కారు పంపిస్తోంది. తక్షణమే సంబంధిత రసాయనాల్ని పంపుతున్నట్లు గుజరాత్ సీఎం కార్యాలయ కార్యదర్శి అశ్వనీ కుమార్ తెలిపారు.
ఆ రసాయనం కేవలం గుజరాత్‌లోని వాపి పట్టణంలో మాత్రమే తయారవుతుందనీ ఆయన పేర్కొన్నారు. పారా- టెర్షియరీ బ్యుటైల్ కాటెకాల్(పీటీబీసీ) సాయంతో ప్రస్తుతం విశాఖలో లీకైన రసాయన వాయువును.. న్యూట్రలైజ్ చేస్తున్నారని... ఇది వాపి పట్టణంలోనే తయారవుతోందని అశ్వనీ కుమార్ అన్నారు.
ఈ రసాయనాల్ని తమకు పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన గుజరాత్ సర్కారు.. వెంటనే దామన్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. వాపి నుంచి రోడ్డు మార్గంలో దామన్‌కు రసాయనాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ సముద్ర సేతు: మాల్దీవులకు 'ఐఎన్ఎస్ జలాశ్వ'