ఊరికో రేషన్ డీలర్ ఉంటారు.. కానీ, వారిని జనం ఎన్నుకోరు. అయితే, ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని ఓ గ్రామంలో మాత్రం రేషన్ డీలర్‌ను జనమే ఎన్నకున్నారు.
అన్ని ఊర్లలాగే ఆగ్రా, సింగార్వాలి గ్రామంలోనూ ఓ రేషన్ దుకాణం ఉంది. అందులో సరుకులు విక్రయించేందుకు ఓ రేషన్ డీలర్ కూడా ఉండేవాడు. నాలుగైదు నెలల క్రితమే ఆ డీలర్ స్వచ్ఛందంగా రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో, దుకాణం మూతపడింది. గ్రామస్థులు రేషన్ కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
రేషన్ కోసం ఊరి ప్రజలు పడుతున్న ఇక్కట్లు స్థానిక అధికారుల దృష్టికి చేరింది. కొత్త రేషన్ డీలర్ నియామకం కోసం ఓ ఆలోచన చేశారు. సర్పంచ్ బిజేంద్ర సింగ్ అధ్యక్షతన ఊరి సర్కారు బడిలో బహిరంగ సమవేశం ఏర్పాటు చేశారు. బహిరంగ సమావేశానికి హాజరైన వందలాదిమంది గ్రామ ప్రజలే కొత్త రేషన్ డీలర్‌ను ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి: 56 శాసనసభ స్థానాలకు నవంబరులో ఉపఎన్నికలు