ETV Bharat / bharat

మొబైల్ యాప్ ద్వారా బ్లడ్​ బ్యాంకుల సేవలు

సురక్షితమైన రక్తం అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించిన యాప్​ను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న రెడ్​క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఉన్న నిల్వలను ఒకే చోట తెలుసుకునే విధంగా యాప్​ను రూపొందించారు. అవసరమున్న వ్యక్తులు నాలుగు యూనిట్ల రక్తాన్ని యాప్​ ద్వారా అభ్యర్థించి.. బ్లడ్ బ్యాంక్​ నుంచి తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Vardhan launches mobile app to enable people have easy access to blood
సురక్షితమైన రక్తం ఈ యాప్​తో మరింత సులభం!
author img

By

Published : Jun 25, 2020, 7:22 PM IST

ప్రజలందరికీ సురక్షితమైన రక్తం సులభంగా అందుబాటులో ఉండే విధంగా మొబైల్ అప్లికేషన్​ను ఆవిష్కరించారు కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సెంటర్ ఫర్ డెవలప్​మెంట్ ఆఫ్ అడ్వాన్స్​డ్ కంప్యూటింగ్​కు చెందిన ఈ-రక్త్​ కోశ్ బృందం రూపొందించిన ఈ అప్లికేషన్​ను ప్రారంభించారు.

ఈ యాప్​ ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన సేవలను సింగిల్ విండో ద్వారా యాక్సెస్ చేసే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు.

"సురక్షితమైన రక్తం సేకరణలో ఇబ్బందుల గురించి గత నెల రోజులుగా చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొంతమందికి క్రమం తప్పకుండా రక్తం అవసరమవుతుంది. ఈ యాప్​ ద్వారా ఒకసారి నాలుగు యూనిట్ల రక్తాన్ని కోరవచ్చు. వినియోగదారులు ఈ రక్తాన్ని తీసుకోవడానికి 12 గంటల సమయం ఉంటుంది. దేశంలో మహమ్మారి వ్యాప్తి ఉన్న నేపథ్యంలో రక్తం అవసరం ఉన్న వారికి ఈ మొబైల్ యాప్ ఒక అనుసంధానంలా పనిచేస్తుంది."

-హర్షవర్ధన్, కేంద్ర వైద్య శాఖ మంత్రి

ఈ యాప్​ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ బ్లడ్​ బ్యాంకుల్లో ఉన్న రక్త నిల్వల గురించి తెలుసుకోవచ్చని వైద్య శాఖ తెలిపింది. యాప్​ ద్వారా ఒక అభ్యర్థన చేయగానే బ్లడ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాల్లోని ఈ-రక్త్​కోశ్ డాష్​బోర్డుపై సమాచారం కనిపిస్తుందని... దీని ద్వారా నిర్దిష్ట సమయంలో రక్తం సరఫరా చేసే అవకాశం ఉందని వైద్య శాఖ పేర్కొంది.

రక్తదాన శిబిరాల వివరాలు

స్వచ్ఛందంగా రక్త దానం చేయాలనుకునే వారికి బ్లడ్ డొనేషన్ క్యాంపు వివరాలు యాప్​లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

భళా రెడ్​క్రాస్!

కొవిడ్ సమయంలో దాతల నుంచి సేకరించి సురక్షితమైన రక్తం సరఫరా చేయడంలో రెడ్​క్రాస్ సొసైటీ ముఖ్యమైన పాత్ర పోషించిందని హర్షవర్ధన్ కొనియాడారు. రెడ్​క్రాస్ మేనేజింగ్ బాడీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 89 రెడ్​క్రాస్ బ్లడ్​ బ్యాంకులు 1,100 అనుబంధ శాఖలు కలిసి లాక్​డౌన్ సమయంలో లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ సమయంలో ఇన్​-హౌజ్​ డొనేషన్లతో పాటు రెండు వేల రక్తదాన కేంద్రాలను రెడ్​క్రాస్ సొసైటీ నిర్వహించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రజలందరూ రక్తదానం చేయాలని మంత్రి హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. తరచుగా రక్తదానం చేయడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు నయమవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి 'భారత్​ ఎప్పుడూ దురాక్రమణకు యత్నించలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.