ETV Bharat / bharat

పాక్​లో భారత 'హైకమిషన్​' అధికారులు అదృశ్యం - గౌరవ్​ అహ్లువాలియా

Two Indian officials working with Indian High Commission in Islamabad (Pakistan) are missing
పాక్​లో ఇద్దరు భారత దౌత్య అధికారుల మిస్సింగ్​
author img

By

Published : Jun 15, 2020, 11:07 AM IST

Updated : Jun 15, 2020, 12:27 PM IST

11:28 June 15

పాక్​లో భారత 'హైకమిషన్​' అధికారులు అదృశ్యం

పాకిస్థాన్​లోని భారత హైకమిషన్​లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ అధికారులు అదృశ్యమయ్యారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి.  

హైకమిషన్​ కార్యాలయం నుంచి.. వాహనంలో బయల్దేరిన వారు గమ్యస్థానాన్ని చేరుకోలేదని అధికారులు తెలిపారు. దీనిపై పాక్​ అధికార వర్గాలకు ఫిర్యాదు చేశారు. 

పాకిస్థాన్​లో భారత సీనియర్​ దౌత్య వేత్త గౌరవ్​ అహ్లువాలియా కారును ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్​ఐ సభ్యులు వెంబడించిన కొద్దిరోజుల అనంతరం.. ఇది జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత అధికారుల కనిపించకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  

వరుసగా ఇలాంటి ఘటనలు తలెత్తుతుండటంతో.. పాకిస్థాన్​లోని భారత హైకమిషన్​ మార్చిలోనే ఆ దేశ విదేశీ మంత్రిత్వ శాఖ వద్ద తీవ్ర నిరసన తెలిపింది. మార్చిలోనే పాక్​ నిఘా సంస్థల నుంచి.. భారత అధికారులకు 13 సార్లు వేధింపులు ఎదురయ్యాయని.. ఇలాంటి ఘటనలు ఆపాలని, దర్యాప్తు చేయాలని కోరింది. 

11:02 June 15

పాక్​లో ఇద్దరు భారత దౌత్య అధికారుల మిస్సింగ్​

పాకిస్థాన్​ ఇస్లామాబాద్​లో భారత హైకమిషన్​లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ అధికారులు అదృశ్యమైనట్లు తెలుస్తోంది.

Last Updated : Jun 15, 2020, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.