ETV Bharat / bharat

మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్​! - Two Indian crew on board cruise ship off Japanese coast test positive for coronavirus

ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. మరో ఇద్దరు భారతీయులకు ఈ ప్రాణాంతక మహమ్మారి సోకింది. కరోనా భయంతో జపాన్​ తీరంలో నిలిపేసిన నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులకు కరోనా సోకినట్లు సమాచారం.

Two Indian crew on board cruise ship off Japanese coast test positive for coronavirus
మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్​!
author img

By

Published : Feb 13, 2020, 12:32 AM IST

Updated : Mar 1, 2020, 4:04 AM IST

కరోనా సోకుతుందన్న భయాలతో జపాన్ తీరంలో నిలిపేసిన నౌకలోని ఇద్దరు భారతీయులకు ప్రాణాంతక మహమ్మారి సోకినట్లు సమాచారం. ఈ మేరకు జపాన్​లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొత్తంగా నౌకలోని 174మందికి కరోనా సోకిందని సమాచారం. గత నెలలో హాంకాంగ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడిలో కరోనా వైరస్‌ గుర్తించింది జపాన్. ఈ నేపథ్యంలో 3,711 మందితో తీరానికి చేరుకున్న డైమండ్ ప్రిన్సెస్ నౌకలోని వారిని తమ దేశంలోకి రావొద్దంటూ నిలిపేసింది. అయితే ఇదే నౌకలో ప్రయాణికులు, సిబ్బందితో సహా.. మొత్తం 138 భారతీయులున్నారు.
మొత్తం 174 మంది పరీక్షలకు...
కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో.. నౌకకు ఈ నెల 19 వరకు అనుమతి నిరాకరించినట్లు తెలిపింది జపాన్. నౌకలో ఉన్న ప్రయాణికుల్లో ఇద్దరు భారతీయులతో సహా మొత్తం 174 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. అయితే.. ప్రోటోకాల్​ ప్రకారం వైరస్​ సోకిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Intro:Body:

asd

Conclusion:
Last Updated : Mar 1, 2020, 4:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.