ETV Bharat / bharat

ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు - జస్టిస్ ఎన్వీరమణ

ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణపై.. సుప్రీం కోర్టు లిఖితపూర్వక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా.. నేతలపై ఉన్న కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పంపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు స్పష్టం చేసింది.

Supreme orders on the trial of public representatives' cases
ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై సుప్రీం కీలక ఆదేశాలు
author img

By

Published : Sep 17, 2020, 7:12 PM IST

ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. ఈ మేరకు గురువారం లిఖితపూర్వక మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. నేతలపై ఉన్న కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి పంపాలని.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. ఈ ప్రక్రియ వారం రోజుల్లోగా పూర్తి కావాలని జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

జిల్లాల్లో పెండింగ్​లో ఉన్న కేసులు, ప్రత్యేక కోర్టుల అవసరం, ప్రస్తుతం ఉన్న ప్రత్యేక కోర్టులను పరిగణనలోకి తీసుకొని.. ప్రణాళిక తయారు చేయాలని హైకోర్టు సీజేలకు ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.

సుప్రీం కోర్టు తీర్పులోని కీలక విషయాలు..

  • అందుబాటులో ఉన్న న్యాయవాదులు, ఏ అంశాలకు చెందిన కేసులు, ఎంత కాలానికి ప్రత్యేక కోర్టులకు జడ్జిల నియామకం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • కేసు విచారణ ముగింపునకు పట్టే సమయం, కోర్టుల మధ్య దూరం, సరైన మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకోవాలి.
  • ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను ప్రత్యేక కోర్టులకు బదిలీ చేయాలా వద్ద అన్న అంశంపై హైకోర్టు సీజేలు నిర్ణయం తీసుకోవాలి.
  • ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించడానికి హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలి.

అమికస్ క్యూరీ చేసిన ప్రతిపాదనలపై అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేల అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు.. కేసుల విచారణను త్వరగా ముగించే విషయంలో ఏవైనా సూచనలు ఉంటే ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.

స్టేలు ఉన్న కేసుల్లో నిలుపుదల కొనసాగించాలా లేదా అన్నదానిపై సుప్రీంకోర్టు గత తీర్పుల ఆధారంగా హైకోర్టు సీజేలు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. స్టే అవసరమైన కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టి 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

కరోనా కారణంతో కేసులు వాయిదాలు వేయకూడదని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు జిల్లాకో ప్రత్యేక కోర్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.