ETV Bharat / bharat

ఆ పెళ్లికి 108 మంది ముఖ్య అతిథులు.! - Special Invitation for 108 Corona Warriors for wedding in mysore

మీ పెళ్లికి అయితే ముఖ్య అతిథులుగా ఎవరిని పిలుస్తారు? కుటుంబపరంగా మీ వంశంలో గొప్ప వ్యక్తులనో, అదే రాజకీయంగా అయితే స్థానిక ఎమ్మెల్యేనో ఆహ్వానిస్తారు కదా! మైసూరులో నవంబర్​ 2న ఒక్కటి కాబోతున్న ఓ జంట మాత్రం వినూత్నంగా 108 మంది కరోనా వారియర్స్​ను ముఖ్య అతిథులుగా పిలిచింది.

Special Invitation for 108 Corona Warriors at Wedding Ceremony to be held in Mysore
ఆ పెళ్లికి 108 మంది ముఖ్య అతిథులు.!
author img

By

Published : Oct 31, 2020, 7:49 PM IST

Updated : Oct 31, 2020, 8:09 PM IST

కర్ణాటక మైసూర్​కు చెందిన రశ్మీ, నవీన్​లు నవంబర్​ 2న వివాహం చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి ఓ ప్రత్యేకత ఉంది. కరోనా కష్టకాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించిన 108 మంది కరోనా వారియర్స్​.. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా కనువిందు చేయనున్నారు.

Special Invitation for 108 Corona Warriors at Wedding Ceremony to be held in Mysore
వివాహ ఆహ్వాన పత్రిక

అతిథులు వీరే...

స్థానికంగా ఉండే పారిశుధ్య కార్మికులు, అంగన్​వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులు, తపాలా సిబ్బందిని పెళ్లికి ఆహ్వానించారు.

"కొవిడ్​పై పోరులో ముందుండి నడిచిన యోధులు దేవుళ్లతో సమానం. వారు ఆశీర్వదిస్తే.. భగవంతుడు ఆశీర్వదించినట్లే. వాళ్లు అందించే శుభాకాంక్షల కన్నా మరేవి నాకు అంత సంతృప్తిని ఇవ్వవు. వారంతా మాకు బంధువులు, పెళ్లి పెద్దలు కూడా. వారిని పిలిచి గౌరవించడం చాలా ఆనందంగా ఉంది".

-రశ్మీ ,పెళ్లి కూతురు

ఇదీచూడండి: ఆ బాలిక సంకల్పానికి బ్రిటన్​ విశిష్ట పురస్కారం

Last Updated : Oct 31, 2020, 8:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.