ETV Bharat / bharat

జీతాలు చెల్లించలేని స్థితిలో షిరిడీ ఆలయ ట్రస్టు

కరోనా కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది ప్రముఖ షిరిడీ సాయిబాబా ఆలయ ట్రస్టు. లాక్​డౌన్​లో భక్తులు లేక, విరాళాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జీతాల విషయంపై ట్రస్టును అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందని అక్కడి ఉద్యోగి ఒకరు చెప్పారు.

author img

By

Published : Jun 22, 2020, 1:51 PM IST

Updated : Jun 22, 2020, 2:18 PM IST

Shirdi: Saibaba temples struggles to pay employees amidst cash crunch
ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో శిరిడీ ఆలయ ట్రస్టు

కరోనా మహమ్మారి కారణంగా సంపన్న ఆలయ ట్రస్టుల్లో ఒకటైన షిరిడీ సాయిబాబా ట్రస్టు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఏటా రూ.400 కోట్ల ఆదాయం పొందే ఈ ప్రసిద్ధ ఆలయం.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. నిర్వహణ ఖర్చులు కూడా సమకూర్చుకోలేకపోతోంది. ప్రతినెలా 5వ తేది వరకు వచ్చే జీతాలు ఈ సారి 20 దాటినా రాలేదని షిరిడీ ఆలయ సిబ్బంది తెలిపారు. ట్రస్టును ఈ విషయమై సమాచారం అడిగినా ఎలాంటి స్పందన రాలేదన్నారు.

ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు నీటిని సరఫరా చేసే 32 మంది సిబ్బందికి గతేడాది నవంబరు నుంచి జీతాలు చెల్లించలేదు. తక్షణమే వేతనాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

రోజుకు రూ. 1.58 కోట్ల నష్టం

నిత్యం భక్తులతో రద్దీగా ఉండే షిరిడీ సాయిబాబా ఆలయం.. కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ కారణంగా 90 రోజులుగా వెలవెలబోతోంది. సగటున రోజుకు 25 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చేవారు. పండుగ సందర్బాల్లో ఆ సంఖ్య దాదాపు లక్ష ఉండేది. లాక్​డౌన్​లో ఆలయానికి విరాళాలు కూడా అందడం లేదు. రోజుకు రూ.1.58 కోట్ల మేర నష్టపోతున్నట్లు అక్కడి ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ట్రస్టు వద్ద నిధులు లేవని పేర్కొన్నాయి.

గతంలో వచ్చిన విరాళాలను బ్యాంకులలో ఫిక్స్​డ్​ డిపాజిట్ల రూపంలో జమచేశారు. లాక్​డౌన్​ అమల్లోకి వచ్చాక ఆ డిపాజిట్ల నుంచే సిబ్బందికి జీతాలు చెల్లించారు. మే నెలకు వచ్చే సరికి ఖాతాలు ఖాళీ అయ్యాయి. దీంతో జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

ఈ సంక్షోభ సమయంలో సాబబాబా సూపర్ స్పెషాలిటీలోని వైద్య నిపుణులకు ప్రోత్సాహకాలను నిలిపివేశారు. కాంట్రాక్టు సిబ్బంది వేతనాల్లో 40 శాతం కోత విధించారు. కొంతమందికి సెలవులు పెట్టుకోవాలని సూచించారు.

తమ సమస్యలను మేనేజింగ్​ కమిటీకి తెలియజేసినా మౌనమే సమాధానంగా వచ్చిందని ఆలయ ట్రస్టు ఉప కార్యనిర్వాహక అధికారి రవీంద్ర ఠాక్రే తెలిపారు. ఆలయాన్ని తెరిచాక భక్తుల తాకిడితో ప్రస్తుత ఆర్థిక నష్టాలు తీరిపోతాయని అధికారులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి: 'భక్తులు లేకుండానే జగన్నాథ రథ యాత్ర!'

Last Updated : Jun 22, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.