ETV Bharat / bharat

'సీ-ప్లేన్'తో పర్యటక భారతానికి సరికొత్త కళ - సీ ప్లేన్​ సేవలు ప్రారంభం

పర్యటకులకు సరికొత్త అనుభూతిని అందించే సీ ప్లేన్ సర్వీస్ దేశంలో అందుబాటులోకి రానుంది. గుజరాత్​లో ఈ సేవలను శనివారం ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

sea plane opening by pm narendra modi
సీ ప్లేన్​ సేవలు ప్రారంభించనున్న మోదీ
author img

By

Published : Oct 30, 2020, 5:27 PM IST

నీటిపై నుంచే టేకాఫ్, ల్యాండింగ్ అవుతూ పర్యటకులకు సరికొత్త అనుభూతిని అందించే సీ ప్లేన్ సర్వీస్ దేశంలో అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్- కేవడియా మధ్య ఈ సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు.

పర్యటకులకు సరికొత్త అనుభూతినివ్వనున్న 'సీ-ప్లేన్'
sea plane opening by pm narendra modi
సీ ప్లేన్​ సేవలు ప్రారంభించనున్న మోదీ

అహ్మదాబాద్‌లోని సబర్మతి నది నుంచి సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం వరకు చక్కర్లు కొడుతూ నీటిపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సీ-ప్లేన్‌ను మాల్దీవులలోని మాలే నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తెప్పించింది.

గంటకు 290కిలోమీటర్ల వేగం..

sea plane opening by pm narendra modi
సీ ప్లేన్​ సేవలు ప్రారంభించనున్న మోదీ

ట్విన్ ఒట్టెర్ 300 మోడల్ ఫ్లైట్ అయిన ఈ సీ-ప్లేన్... గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో సిబ్బంది సహా 19 మంది ప్రయాణించేందుకు వీలుంది. ప్రయాణికుల కోసం 14 సీట్లు ఏర్పాటు చేశారు. ఏరియల్ సర్వే తరహా కార్యక్రమాల కోసం నెమ్మదిగా నడిపితే 4 గంటల పాటు ఎగరగలదు. వేగంగా నడిపితే 2 గంటలపాటు విహరించవచ్చు.

టికెట్ ధర ఎంతంటే..

sea plane opening by pm narendra modi
సీ ప్లేన్​ సేవలు ప్రారంభించనున్న మోదీ

అహ్మదాబాద్ నుంచి నాలుగు సార్లు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. అహ్మదాబాద్ నుంచి కేవడియాకు మొత్తం 8 ట్రిప్పులు నడపాలని అధికారులు భావిస్తున్నారు. టికెట్ ధరను 4 వేల 800 రూపాయలుగా నిర్ణయించారు. ఈ సీ-ప్లేన్‌ బాధ్యతను స్పైస్‌ జెట్ విమాన సంస్థ నిర్వహించనుంది.

సీ ప్లేన్ సర్వీస్ కోసం నాలుగు వాటర్ ఏరోడ్రోమ్స్‌ నిర్మాణాలకై పౌర విమానయాన శాఖ, ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో జులైలో గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.