ETV Bharat / bharat

పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణపై నేడు సుప్రీంలో విచారణ - పూరీ రథయాత్ర 2020

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది పూరీ జగన్నాథ రథయాత్రను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి.. అనుమతించాలని దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ నెల 18న ఇచ్చిన స్టే ఆదేశాలను పునఃసమీక్షించాలని జగన్నాథ్​ సంస్కృతి జన జాగారణ మంచ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మంగళవారం ప్రారంభం కావాల్సిన రథయాత్ర నిర్వహణపై నేడు పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.

SC to hear on Monday pleas seeking recall of its order staying Puri Rath Yatra
పూరీ రథయాత్ర నిర్వహణపై రేపు సుప్రీంలో విచారణ
author img

By

Published : Jun 22, 2020, 5:24 AM IST

కరోనా కారణంగా ఈ ఏడాది పూరీ జగన్నాథుడి రథయాత్రపై నెలకొన్న ప్రతిష్టంభనపై నేడు స్పష్టత రానుంది. ఈనెల 23న మంగళవారం నుంచి రథయాత్ర ప్రారంభ కావాల్సి ఉన్నా.. ఈనెల 18న స్టే విధించింది సుప్రీం కోర్టు. ఈ నేపథ్యంలో.. రద్దు ఆదేశాలను సవరించి అనుమతులు ఇవ్వాలని పలువురు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది జస్టిస్​ ఎస్​. రవీంద్ర భట్​ నేతృత్వంలోని ధర్మాసనం.

లక్షలాది మంది భక్తులు పాల్గొంటూ, మత విశ్వాసాలకు అతీతమైన ఉత్సవాలను రద్దు చేయడం ఆచరణ యోగ్యంకాదని 'జగన్నాథ్​ సంస్కృతి జన జాగారణ్​ మంచ్​' పేరిట వ్యాజ్యం దాఖలైంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునః సమీక్షించుకోవాలని కోరారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా పాలకుల ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటిస్తూ రథయాత్ర నిర్వహించేందుకు అనుమతినివ్వాలని పేర్కొన్నారు.

12 ఏళ్లపాటు..

ఈ ఏడాది రథయాత్ర జరగకపోతే.. వచ్చే 12 ఏళ్లపాటు నిర్వహించకూడదని మరో పిటిషనర్​ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కనీసం భక్తులు లేకుండా నిర్వహించేందుకైనా అనుమతులు ఇవ్వాలని కోరారు.

కోర్టుకు భాజపా

జగన్నాథ రథయాత్ర నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది భాజపా. ఈనెల 18న ఇచ్చిన స్టే ఉత్తవర్వులను పునఃసమీక్షించాలని కోరారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర.

రెండు వారాలపాటు..

పూరీ జగన్నాథ రథయాత్రు సుమారు 10 - 12 రోజులకు పైగా జరుగుతుంది. లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది రథయాత్ర నెల 23న జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా రద్దయింది. అయితే 'బహుద జాత్ర(రిటర్న్​ కార్​ ఫెస్టివల్)'ను మాత్రం జులై 1న జరపాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: 'రథయాత్రకు అనుమతిస్తే జగన్నాథుడు క్షమించడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.