ETV Bharat / bharat

చైనాతో కయ్యం ఒక్కోసారి ఒక్కో చోట.. ఎందుకు? - భారత్ చైనా మ్యాప్

భారత్- చైనా 3,440 కి.మీ మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. అక్సాయిచిన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న ఈ సరిహద్దులో ఒక్కోసారి ఒక్కో ప్రాంతం వివాదానికి కేంద్రబిందువు అవుతోంది. అయితే చైనా ఈ రకంగా ఉద్రిక్తతలు రాజేయడానికి గల కారణాలేంటి? చైనా వ్యూహం వెనకున్న ఆంతర్యమేంటి?

reson behind india china border conflict in each region along lac etv bharat
సరిహద్దు వివాదం ఒక్కోసారి ఒక్కో చోట.. ఎందుకు?
author img

By

Published : Jun 17, 2020, 2:10 PM IST

  • 2014 ధెమ్​చోక్... భారత్- చైనా సైన్యాల మధ్య మూడు వారాల పాటు ఘర్షణ
  • 2015 లద్దాఖ్​లోని బర్ట్సే... వారం రోజుల సైనిక వివాదం
  • 2017 డోక్లామ్​... భారత్, చైనా, భూటాన్ ట్రైజంక్షన్​లో 70 రోజుల సైనిక ప్రతిష్టంభన
  • 2020 గాల్వన్ లోయ... 45 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో హింసాత్మక ఘర్షణ

సమయం మారుతుంది. ప్రదేశం మారుతుంది. కానీ చైనా తీరులో మాత్రం మార్పు లేదు. 1962లో జరిగిన సంక్షిప్త యుద్ధం నుంచి డ్రాగన్​ దేశం ఇలా కవ్వింపులకు దిగుతూనే ఉంది.

సరిహద్దులో సాధారణంగా ఏటా 400-500 వరకు చొరబాట్లు జరుగుతాయి. కానీ ఈ వివాదాలన్నీ త్వరగానే పరిష్కారమవుతాయి. అయితే డ్రాగన్ ఎత్తుడగలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. మొత్తం 3,440 కి.మీ పొడవైన వాస్తవాధీన(ఎల్‌ఏసీ) రేఖ వెంబడి ప్రతి చోటా వివాదాలు రాజేస్తోంది. మూడు సెక్టార్లుగా విభజితమైన ఈ ఎల్​ఏసీ వెంట ఉన్న వివిధ భూభాగాలు తమదేంటూ ఆరోపిస్తోంది. దీటుగా, వేగంగా స్పందించే సమయం భారత్​కు లేకుండా ఒక్కోసారి ఒక్కో చోట్ల పన్నాగాలు పన్నుతోంది.

పశ్చిమ సెక్టార్​లో అక్సాయిచిన్, దెమ్‌చోక్‌... మధ్య సెక్టార్​లో పాంగాంగ్ సరస్సు, గాల్వాన్‌ లోయ, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ- తూర్పు సెక్టార్‌లో లోంగ్జూ, నమ్కా చూ లోయ, సుమ్‌దోరాంగ్‌ చూ, యాంగ్జే ప్రాంతాల్లో చైనా ఇదివరకు ఘర్షణలకు పాల్పడింది. గాల్వన్ లోయ చుట్టూ మూడు ప్రాంతాల్లో, లద్దాఖ్​లోని పాంగాంగ్ సరస్సు సమీపంలో మరో చోట ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

సన్నద్ధమయ్యేసరికి మరో చోట..

అయితే ఒక్కోసారి ఒక్కోచోట చైనా అతిక్రమణలకు పాల్పడటానికి గల కారణాలేంటని గమనిస్తే డ్రాగన్ వ్యూహం స్పష్టమవుతుంది. భారత్ సన్నద్ధత సరిగా లేని ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తూ వచ్చింది చైనా. వివాదం ప్రారంభమైన ప్రదేశాల్లో భారత్ మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకునే సమయానికి మరో ప్రాంతంలో పాగా వేస్తోంది. చైనాపై తిరిగి దెబ్బకొట్టే అవకాశం భారత సైన్యానికి ఇవ్వకుండా... ఘర్షణలు ఎక్కువగా జరిగే పశ్చిమ సెక్టార్ నుంచి తూర్పు సెక్టార్ వరకు ఇదే వ్యూహాన్ని అమలు చేసింది.

మెరుగుపడుతున్న భారత్

వనరుల ప్రాతిపదికన వాస్తవాధీనరేఖ వద్ద భారత్​తో పోలిస్తే చైనా సైన్యమే బలంగా ఉంది. అయితే కొన్నేళ్లుగా రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక సౌకర్యాల నిర్మాణం విషయంలో భారత్‌ చురుకుగా పనిచేస్తోంది. మారిన పరిస్థితుల్లో 'ఎల్‌ఏసీ' వద్ద భారత్‌ సైతం బలంగానే ఉందని చెప్పక తప్పదు.

1962నాటి యుద్ధాన్ని పక్కనపెడితే- భారత్‌పై ఆ తరవాత వివిధ సందర్భాల్లో సైనికపరమైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు చైనా ప్రయత్నించింది. 1967లో నాథులా ఘటన మొదలుకొని ఇటీవలి వరకూ ఏ ఒక్క సందర్భంలోనూ దాని ప్రయత్నం విజయవంతం కాలేదు.

ఇదీ చదవండి: ఘర్షణ కొత్తేం కాదు- కానీ ఈసారి మరింత దూకుడుగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.