ETV Bharat / bharat

రైతులు, యువతకు మోదీ పాలనలో అన్యాయం :రాహుల్​ - కాంగ్రెస్​ అధ్యక్షుడు

బిహార్​లో జరిగిన కాంగ్రెస్​ సభలో భాజపాపై మండిపడ్డ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ

రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు
author img

By

Published : Feb 3, 2019, 7:56 PM IST

భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటబీమా పథకం రైతులను దోపిడి చేసి ధనిక వ్యాపారవేత్తల జేబులు నింపుతోందని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. తాము కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.

కాంగ్రెస్​ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి బిహార్​లో పర్యటించారు రాహుల్.​ నితీష్​ కుమార్​ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మోదీలాగే బిహార్​ ముఖ్యమంత్రి ఉత్తుత్తి హామీలు ఇచ్చారని ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్​ రాజకీయలపైనా రాహుల్​ మాట్లాడారు. లాలు ప్రసాద్​ యాదవ్, తేజస్వీ యాదవ్​లతో కలిసి కాంగ్రెస్​ పార్టీ ఆ రాష్ట్రంలో ముందుకెళుతుందని స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిహార్​ యువతను చిన్నచూపు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని రాహుల్​ విమర్శించారు.

రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు
undefined

"బిహార్​ యువతకు మీరు(మోదీ) ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ప్రతి ఏడాది రెండు కోట్లమంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. నరేంద్ర మోదీ వల్ల ఉద్యోగాలు పొందినవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు... రైతుల రుణాలను 10 రోజుల్లో మాఫీ చేస్తానని నేను ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లో హామీ ఇచ్చాను. నేను అబద్ధాలు చెప్పను. కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దేశానికి మార్గం చూపించిన పాట్నా విశ్వవిద్యాలయానికి కేంద్ర విశ్వవిద్యాలయ గుర్తింపునిస్తాం."
--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.