కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి జనతా కర్ఫ్యూను ఆ రాష్ట్రంలో మార్చి 31వరకు బంద్‌గా కొనసాగించాలని నిర్ణయించింది.
ఆహారం, ఔషధాలు మినహా ఇతర దుకాణాలన్నీ మూసేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని నిర్దేశించారు.
పంజాబ్‌లో ఇప్పటికే 14 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
ఒడిశాలో...
ఒడిశా సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఖుర్దా, కటక్, గంజాం, కేంద్రపడ, అంగుల్ జిల్లాలు సహా పూరి, రవుర్కెలా, సంబల్పుర్, ఝర్సుగూడ, బాలేశ్వర్ జాజ్‌పుర్, భద్రక్ పట్టణాల్లో ఈనెల 29వ తేదీ రాత్రి 9 గంటల వరకు బంద్ పాటించాలని ఆదేశించింది.