చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ను అనుసంధానించే సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. రిమోట్ ద్వారా ప్రాజెక్టును ఆవిష్కరించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ సహా మరో ఏడు ద్వీపాలకు సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2018 డిసెంబర్ 30న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు మోదీ. ఇందులో భాగంగా తీరంలో ఉన్న ద్వీపాలకు టెలికమ్యునికేషన్ సిగ్నళ్లు పంపించే విధంగా సముద్రగర్భంలో సబ్మెరైన్ కేబుళ్లను ఏర్పాటు చేశారు.
అంతకుముందు... కేబుల్ వ్యవస్థ ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అండమాన్ ప్రజలకు ఈ ఆగస్టు 10 చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు.