ఐక్యరాజ్యసమితి అత్యున్నతస్థాయి ఆర్థిక, సామాజిక మండలి సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ప్రసంగం చేశారు మోదీ. కరోనా నియంత్రణకు అన్ని దేశాలతో కలిసి పోరాడుతున్నామని వ్యాఖ్యానించిన ప్రధాని.. 150కి పైగా దేశాలకు కరోనా ఔషధాలు, ఇతర సామగ్రి అందిస్తున్నామని స్పష్టం చేశారు.
- భారత్ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం: మోదీ
- అందరితో కలిసి పురోగతి సాధించాలనేదే మా నినాదం: మోదీ
- ప్రపంచంలో ప్రస్తుతం భారత్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది
- 7 కోట్ల మంది భారత గ్రామీణ మహిళలు స్వయంసహాయ సంఘాల్లో ఉన్నారు
- సుమారు 40 కోట్ల మందితో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించాం: మోదీ
- ఆయుష్మాన్ అనేది అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమం: మోదీ
- 2025 నాటికి భారత్ నుంచి టీబీని పారదోలతాం: మోదీ
- 2022 నాటికి ప్రతి భారతీయుడికి ఆవాసం ఉండాలనేదే మా లక్ష్యం: మోదీ
- హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం కింద అందరికీ ఇళ్లు: ప్రధాని మోదీ