ETV Bharat / bharat

ఏనుగుపై ఊరేగుతూ కరోనాపై 'మోదీ' ప్రచారం - bihar latest news

బిహార్ సమస్తిపుర్​లో కరోనాపై అవగాహన కల్పించారు మోదీ. అదేంటీ.. దిల్లీలో కరోనాపై పోరులో తీరిక లేకుండా ఉన్న ప్రధాని.. బిహార్​ ఎప్పడు వెళ్లారని అనుకుంటున్నారా? అయితే.. సమస్తిపుర్​ రోడ్లపై ఏనుగు సవారీ చేస్తూ అందరిని పలకరించిన ఆయన ఎవరో తెలుసుకోవాల్సిందే.

Samastipur
ఏనుగుపై ఊరేగుతూ కరోనాపై అవగాహన కల్పించిన మోదీ!
author img

By

Published : May 2, 2020, 2:15 PM IST

కరోనా మహమ్మారి కట్టడి చేయటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పే ప్రతి విషయం ప్రజల్లోకి వెళుతోంది. మోదీ ఏమి చెబుతారా అని యావత్​ దేశం ఆసక్తిగా చూస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్​ సమస్తిపుర్​కు చెందిన ఓ ఉపాధ్యాయుడు, ఆయన స్నేహితులు.. వినూత్న ఆలోచన చేశారు. ప్రధాని మోదీ వేషధారణలో ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నారు.

కార్​పూరి కళాశాలలో విధులు నిర్వర్తిస్తోన్న భూపేంద్ర యాదవ్​ చూడటానికి అచ్చం మోదీలా ఉంటారు. ఇంకేముంది.. వారి ఆలోచన కార్యరూపం దాల్చడం మరింత సులువైంది. భూపేంద్ర యాదవ్​.. మోదీలా తయారై, మథురాపుర్​ ఘాట్​ నుంచి నగరం మొత్తం ఏనుగుపై తిరిగారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించొద్దని, ఇళ్లలోనే ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలాంటి హడావుడి లేకుండా ఏనుగుపై వస్తోన్న మోదీలా ఉన్న వ్యక్తిని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

Samastipur
సమస్తిపుర్​ ప్రధాన కూడలి వద్ద భూపేంద్ర యాదవ్​

ప్రధాని చెప్పిన మాట ప్రజల్లోకి చేరుతుందనే నమ్మకంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు ప్రచార నిర్వాహకుడు మహేంద్ర ప్రధాన్​ తెలిపారు.

"ఇలాంటి ప్రచారాలు తరచుగా నిర్వహిస్తూ కరోనా వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేయాలి. నగరంలోని హాత్​ బజార్​, ఇతర బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించేలా ఈ మాటలు వారిని ప్రోత్సహిస్తాయి. లాక్​డౌన్​, భౌతికదూరం ఒక్కటే కరోనాను కట్టడి చేయగల ఆయుధాలని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు."

-మహేంద్ర ప్రధాన్​, నిర్వాహకుడు

ఈ వినూత్న కార్యక్రమానికి పోలీసుల విభాగం కూడా సహకరించి, కావాల్సిన ఏర్పాట్లు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.