ETV Bharat / bharat

ఒక్కరోజే 10.5 లక్షల కరోనా పరీక్షలు - కరోనా మరణాల రేటు

రికార్డు స్థాయిలో ఒక్కరోజే 10.5లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం టెస్టుల సంఖ్య 4 కోట్ల 14 లక్షలు దాటింది. రికవరీ రేటు 76.61 శాతానికి చేరింది.

No. of COVID-19 tests conducted goes past 4.14 Cr in India
రికార్డు స్థాయిలో ఒక్కరోజే 10.5లక్షల కరోనా పరీక్షలు
author img

By

Published : Aug 30, 2020, 6:10 PM IST

రికార్డు సంఖ్యలో శనివారం ఒక్కరోజే 10,55,027 లక్షల నమూనాలు పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కొవిడ్​ టెస్టుల సంఖ్య 4 కోట్ల 14 లక్షల 61వేలు దాటింది. ఫలితంగా ప్రతి 10లక్షల జనాభాకు వైరస్​ పరీక్షల సామర్థ్యం 30,044కు పెరిగింది.

వీటితో పాటు దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధరణ పరీక్ష ల్యాబ్​ల సంఖ్య పెంచడం కూడా వైరస్​ వ్యాప్తి నివారణలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయపరుస్తూ 'టెస్టింగ్​, ట్రాకింగ్,​ ట్రీట్' విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

No. of COVID-19 tests conducted goes past 4.14 Cr in India
రాష్ట్రాల వారీగా కరోనా కేసులు

మెరుగవుతున్న రికవరీ రేటు..

మహమ్మారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 27 లక్షల 13 వేలు దాటింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.61కి చేరింది. మరణాల రేటు క్రమంగా క్షీణించి... 1.79కు తగ్గింది. ప్రస్తుతం 7,65,302(21.60 శాతం) మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రాల వారీగా కొవిడ్​ కేసుల వివరాలు

ఇదీ చూడండి: యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.