ETV Bharat / bharat

'గల్వాన్​ ఘటనతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి'

తూర్పు లద్ధాఖ్​​ గల్వాన్​ లోయలో సరిహద్దు ఘటన దేశ ప్రజల మనోభావాలను గాయపరిచిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ అన్నారు. జాతీయ ప్రయోజనాల కంటే మరేదీ ముఖ్యం కాదన్న హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిష్కారాలను అన్వేషించాలన్నారు ప్రణబ్​​.

author img

By

Published : Jun 18, 2020, 12:43 PM IST

Updated : Jun 18, 2020, 7:09 PM IST

Nation's conscience bruised, must be addressed satisfactorily: Pranab Mukherjee on Ladakh faceoff
'గాల్వన్​ ఘటనతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి'

భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ఈ ఘటనలో భారత సైనికుల మరణం దేశ ప్రజల మనోభావాలను గాయపరిచిందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ ప్రయోజనాల కంటే మరేదీ ముఖ్యం కాదన్న హామీని ప్రభుత్వం ఇవ్వాలన్నారు ప్రణబ్. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను వెంటనే కట్టడి చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిష్కారాలను అన్వేషించాలన్నారు. లద్దాఖ్​​ ప్రతిష్టంభన జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాలనే కాకుండా, ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిణామాలపై కూడా ప్రభావం చూపుతుందన్నారు.

"సరిహద్దులో సైనికులను కోల్పోవడం వల్ల దేశ ప్రజల మనస్సాక్షి దెబ్బతిన్నది. ఏకాభిప్రాయం ద్వారా ప్రస్తుత సమస్యను పరిష్కారించాల్సిన అవసరం ఉంది. భద్రతాబలగాల సహకారంతో ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది."

-ప్రణబ్​​ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి

సోమవారం రాత్రి గల్వాన్‌ లోయ వద్ద భారత్-చైనా సరిహద్దులో ఇరుదేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా మాత్రం మరణాల లెక్కపై నోరు మెదపలేదు.

ఇదీ చూడండి: 'బొగ్గు గనుల వేలంతో స్వయం సమృద్ధికి తొలి మెట్టు'

Last Updated : Jun 18, 2020, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.