'కరోనిల్' పేరుతో కరోనాకు మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు ప్రకటించిన పతంజలి సంస్థకు షాకిచ్చింది ఆయుష్ మంత్రిత్వశాఖ. కొవిడ్ ఔషధ అంశంలో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ వెంటనే వివరణ ఇవ్వాలని... వెంటనే ఔషధ అనుమతి పత్రాలను సమర్పించాలని కోరింది.
కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు తీసుకొచ్చినట్లు మీడియాలో ప్రకటించడాన్ని తప్పుబట్టింది కేంద్రం. పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చేవరకు మందులపై ప్రకటనలను నిలిపివేయాలని పతంజలికి సూచించింది.