---- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
పశ్చిమబంగాలోని మధ్యతరగతి ప్రజల కలలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అణచివేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దుర్గాపుర్లోని భాజపా సభలో ప్రసంగించిన మోదీ మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
"తృణముల్... టోలిబాజి(బెదిరింపులు).. టాక్స్" వంటి మూడు 'టీ'లకు మమత ప్రభుత్వం ప్రసిద్ధి అని మోదీ విమర్శించారు. గత కమ్యూనిస్టు ప్రభుత్వాల మాదిరే తృణమూల్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆరోపించారు.
నాలుగున్నరేళ్లలో రూ. 90కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం ఆమోదించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రధాని ఆరోపించారు.