ETV Bharat / bharat

కోరలు చాచిన కరోనా- దేశంలో మరో ఆరుగురు మృతి - Covid-19 pandemic in india

దేశంలో కరోనా మృతుల సంఖ్య 25కు చేరింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 867 యాక్టివ్​ కేసులున్నాయి. మరో 86 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.

India reports six more covid-19 deaths
కోరలు చాచిన కరోనా- దేశంలో మరో ఆరుగురు మృతి
author img

By

Published : Mar 29, 2020, 10:09 AM IST

Updated : Mar 29, 2020, 12:42 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో కొవిడ్​-19 మరణాలు 25కు చేరాయి. శనివారం 19 మంది మరణించగా.. తాజాగా మరో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 867 కరోనా యాక్టివ్​ కేసులున్నాయి. మరో 86 మంది ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.

India reports six more covid-19 deaths
దేశవ్యాప్తంగా కరోనా వివరాలు

గుజరాత్​లో 5కు చేరిన మృతులు

అహ్మదాబాద్​లో 45 ఏళ్ల వ్యక్తి వైరస్​ కారణంగా ఇవాళ మృతి చెందినట్లు గుజరాత్​ వైద్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే అతను ఎప్పటి నుంచో మధుమేహం వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది.

తాజా మరణంతో గుజరాత్​లో కరోనా మృతుల సంఖ్య 5కు పెరిగింది. కరోనా సోకిన వారి సంఖ్య 55గా ఉంది.

కశ్మీర్​లో 2కు చేరిన మృతులు

జమ్ముకశ్మీర్​ బారాముల్లాలో కరోనా కారణంగా మరో వ్యక్తి మృతిచెందాడు. ఫలితంగా రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య రెండుకు చేరింది. జమ్ముకశ్మీర్​లో ప్రస్తుతం 20 మంది కరోనాతో బాధపడుతున్నారు.

మహారాష్ట్రలో మరో 12 మందికి కరోనా

మహారాష్ట్రలో మరో 12 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో పుణె-5, ముంబయి-4, సింగ్లి, జల్​గావ్​, నాగ్​పుర్​లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కొవిడ్​-19 బారినపడ్డవారి సంఖ్య 193కు చేరింది.

మధ్యప్రదేశ్​లో మరో 5

మధ్యప్రదేశ్​లో మరో ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వీరిలో ఒకరు ఉజ్జయినికి చెందిన 17 ఏళ్ల బాలిక. మిగిలిన నలుగురు 21, 28, 40, 48 ఏళ్ల వయసున్న పురుషులు. వీరంతా ఇండోర్ వాసులే.

కొత్త కేసులతో కలిపి మధ్యప్రదేశ్​లో కరోనా సోకిన వారి సంఖ్య 39కి చేరింది.

నర్సు.. నువ్వు వెళ్లిపో

ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​లో కాంగ్రెస్ కార్పొరేటర్​ సీతారాం జైశ్వాల్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. తన భవనంలో అద్దెకుంటున్న ఓ నర్సును ఖాళీ చేయమని బలవంతం చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జైశ్వాల్​పై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి : గర్భిణిని అడ్డుకున్న పోలీసులు- అంబులెన్స్​లోనే ప్రసవం

Last Updated : Mar 29, 2020, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.