ETV Bharat / bharat

కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంపొందించే విషయంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేశాయి కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్​. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని వైద్య కళాశాలల్లో ఉండే ఆర్​టీ-పీసీఆర్​ పరికరాలను జిల్లా ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో తాత్కాలికంగా మోహరించాలని పేర్కొన్నాయి.

ICMR, Union health ministry advise states on how to enhance COVID testing capacity
కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు
author img

By

Published : Jul 21, 2020, 5:47 AM IST

దేశంలో కరోనా​ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్​ పరీక్షల సామర్థ్యాన్ని పెంపొందించే అంశంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేశాయి కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్​. ఈ మేరకు స్వల్ప, మధ్యకాలిక పద్ధతులతో కూడిన సలహాలను వివరిస్తూ సంయుక్తంగా లేఖ రాశాయి.

"ల్యాబ్​లను పెంచడం వల్ల కరోనా పరీక్షల సామర్థ్యం పెరుగుతుంది. ఈ మేరకు దేశంలో కరోనా పరీక్షలను విస్తరించేందుకు ఓ వ్యూహాన్ని రచించారు. దీనికి రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వలు, ఐసీఏఆర్​, డీబీటీ, డీఎస్​టీ సహా ఇతర సంస్థల మధ్య సమన్వయం ఉండటం ఎంతో ముఖ్యం."

-- కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్​ సంయుక్త లేఖ

స్వల్పకాలిక పద్ధతిలో.. రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని విద్యా సంస్థల్లో ఉన్న ఆర్​టీ-పీసీఆర్​ పరికరాలను తాత్కాలికంగా.. జిల్లా ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో మోహరించాలని సూచించాయి. వీటితో పాటు ప్రభుత్వ ఈ-మార్కెట్​(జీఈఎం)లో అందుబాటులో ఉన్న రాపిడ్​ యాంటిజెన్​ కిట్లను తక్షణమే కొనుగోలు చేయాలని వెల్లడించాయి.

మధ్యకాలిక పద్ధతిలో.. ప్రతి ప్రభుత్వ పరిశోధనశాలలో కనీసం రెండు ఆర్​టీ-పీసీఆర్​ పరికరాలతో పాటు ఒక ఆర్​ఎన్​ఏ ఎక్స్​ట్రాక్షన్​ పరికరం ఉండాలని సూచించాయి కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్​.

ఇదీ చూడండి:- 'దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.