మధ్యప్రదేశ్, సత్నా జిల్లాలో కొందరు ఆరోగ్య సిబ్బంది.. మందు దాహం తీర్చుకునేందుకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. అంబులెన్స్ లో కరోనా బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తూ.. మార్గమధ్యంలో వైన్ షాప్ వద్ద ఆగి మద్యం కొనుగోలు చేశారు.
ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి, అంబులెన్స్ నుంచి దిగి మందు బాటిళ్లు కొనుక్కెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇదీ చదవండి: పాతికేళ్లు చెత్త ఏరి.. తనకు తానే విగ్రహం కట్టుకొని..