తమిళనాడు కోయంబత్తూర్లో ఓ 13 ఏళ్ల అమ్మాయికి సర్జరీ చేసి కడుపులో నుంచి అరకేజీ వెంట్రుకలు, ఖాళీ షాంపూ ప్యాకెట్లను బయటకు తీశారు వైద్యులు. ఆమె పరిస్థితి, ఆ వెంట్రుకులను చూసి వైద్యులు నివ్వెరపోయారు.
ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక గత కొంత కాలంగా కడుపునోప్పితో బాధపడుతుండేది. భయాందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు... కడుపులో ఓ గడ్డను గుర్తించారు. మొదట ఎండోస్కోపీ పద్దతి ద్వారా వాటిని తొలగించాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. దీనితో డాక్టర్ గోకుల్ క్రిప్ శంకర్ బృందం సర్జరీకి సిద్ధపడింది. అనంతరం కడుపులో నుంచి అరకేజీ జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లు బయటకువచ్చాయి.
'అందుకే తినేసింది'
ఇటీవలే దగ్గరి బంధువు ఒకరు మరణించడం వల్ల ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోయిందని, ఆ సమయంలోనే వెంట్రుకలు, ఖాళీ షాంపు ప్యాకెట్లను తినేసిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మానవత్వం చేరదీసింది.. పచ్చదనం వెల్లివిరిసింది