ETV Bharat / bharat

ఫేస్​బుక్ ఉపాధ్యక్షుడికి సుప్రీంలో ఊరట

ఫేస్​బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు అజిత్ మోహన్​పై అక్టోబర్ 15 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దిల్లీ అసెంబ్లీ కమిటీని సూప్రీంకోర్టు ఆదేశించింది. దిల్లీ అల్లర్లకు సంబంధించి అసెంబ్లీ కమిటీ జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకంగా అజిత్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.. లోక్​సభ, రాజ్యసభ కార్యదర్శులు, దిల్లీ పోలీసులతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

Delhi riots: No coercive action against Facebook VP till Oct 15 over assembly panel summons, says SC
'ఫేస్​బుక్ ఉపాధ్యక్షుడిపై అప్పటి వరకు చర్యలొద్దు'
author img

By

Published : Sep 23, 2020, 4:33 PM IST

ఫేస్​బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అజిత్ మోహన్​పై అక్టోబర్ 15 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దిల్లీ అసెంబ్లీ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

దిల్లీ అల్లర్ల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై ఫేస్​బుక్​ ఉదాసీన వైఖరి అవలంబించిందన్న ఆరోపణలపై అసెంబ్లీ శాంతి భద్రతల కమిటీ విచారణ జరుపుతోంది. ఈ విషయంపై తమ ముందు హాజరు కావాలని అజిత్​ మోహన్​కు ఇదివరకే రెండు సార్లు నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించిన మోహన్.. తనకు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్​ కృష్ణ మురారీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మోహన్ పిటిషన్​పై అభిప్రాయం చెప్పాలని కేంద్ర హోం, ఐటీ, న్యాయ మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం. లోక్​సభ, రాజ్యసభ కార్యదర్శులు, దిల్లీ పోలీసులకు కూడా తాఖీదులు ఇచ్చింది.

ఇదీ చదవండి- ఫేస్​బుక్​కు మళ్లీ నోటీసులు.. విచారణకు రావాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.