దేశంలో కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 148 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
రాష్ట్రాల వారీగా
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 148 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 64, గుజరాత్- 24, దిల్లీ- 18, ఉత్తర్‌ప్రదేశ్- 11, తమిళనాడు- 7, బంగాల్- 6, తెలంగాణ- 5, రాజస్థాన్- 4, మధ్యప్రదేశ్- 3, జమ్ము కశ్మీర్- 2; బిహార్, ఒడిశా, హరియాణా, పంజాబ్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున్న నమోదయ్యాయి.
ఇదీ చూడండి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ విహంగ వీక్షణం