ETV Bharat / bharat

తీవ్ర తుపానుగా ఉమ్​ పున్​​.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు! - CYLCONE LIVE UPDATES

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడి తీవ్ర తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఒడిశా, బంగాల్​ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మే 20 మధ్యాహ్నానికి​ హతియా దీవులు, సాగర్​ ద్వీపాల మధ్య తుపాను తీరం దాటనుందని తెలిపింది.

Cyclone Amphan likely to hit West Bengal on 20th May
తీవ్ర తుపానుగా మారిన అంఫాన్​.. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
author img

By

Published : May 17, 2020, 7:12 PM IST

బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'ఉమ్​ పున్​' ఆదివారం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఈ నేపథ్యంలో ఒడిశా, బంగాల్​ రాష్ట్రాల్లోని అనేక తీర ప్రాంతాల్లో అధిక వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య దిశగా 3 కిలోమీటర్ల వేగంతో వెళ్లి తీవ్రమైన తుపానుగా మారినట్లు తెలిపింది. మే 20 మధ్యాహ్నానికి బంగ్లాదేశ్​- బంగాల్​కు చెందిన హతియా దీవులు, సాగర్​ ద్వీపాల మధ్య తుపాను తీరాన్ని దాటనుందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఒడిశాలోని పారదీప్​కు దక్షిణాన 980 కిలోమీటర్ల దూరంలో ఉమ్​ పున్​​ కేంద్రీకృతమై ఉండగా.. బంగాల్​​లోని దిఘాకు నైరుతి దిశగా 1,130 కి.మీ, బంగ్లాదేశ్​కు 1,250 కి.మీటర్ల దూరంలో ప్రయాణిస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న 12 గంటల్లో తుపాను మరింత తీవ్ర రూపం దాల్చి.. 24 గంటల్లో ఉత్తరం దిశగా ప్రయాణించనున్నట్లు పేర్కొంది. అనంతరం దిశ మార్చుకుని హతియా- సాగర్​ ద్వీపాల మధ్య తీరం దాటనుందని పేర్కొంది.

భారీ వర్షాలు...

మే 19న బంగాల్​ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నట్లు పేర్కొన్నారు వాతావరణశాఖ అధికారులు. ఒడిశాలోని గజపతి, గంజాం, పూరి, జగత్​సింగ్​పుర్​ తదితర ప్రాంతాల్లోనూ ఉమ్​ పున్​​ కారణంగా భారీ వర్ష సూచనలున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన తీర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురువనున్నట్లు వివరించారు.

మే 18 సాయంత్రం నుంచి ఒడిశా దక్షిణ తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు​ వీయనున్నట్లు తెలిపారు అధికారులు. ఇదే తరహాలో మే 19న గాలులు విజృంభించనున్నట్లు పేర్కొన్నారు. మే 20 నాటికి 90 కిలోమీటర్ల వేగంతో గాలి తీవ్ర రూపం దాల్చనుందని హెచ్చరించారు.. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నట్లు స్పష్టం చేశారు. క్రమక్రమంగా పెరుగుతూ.. మే 20 నాటికి 180 కిలోమీటర్ల వేగానికి చేరనున్నట్లు హెచ్చరించారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. ఈ రోజు రాత్రికల్లా అందరూ తీరాలకు తిరిగి రావాలని అధికారులు కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.