ETV Bharat / bharat

రాముడి కోసం ముస్లిం మహిళల ప్రత్యేక రాఖీలు

ఉత్తర్​ప్రదేశ్ అయోధ్య ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళలు రాముడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కోసం ప్రత్యేకంగా రాఖీలు సిద్ధం చేస్తున్నారు. ఈ రాఖీలను పోస్ట్ ద్వారా పంపించనున్నారు. రామ మందిర భూమి పూజ సందర్భంగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ సభ్యుల ద్వారా రాముడికి ధరింపజేయనున్నారు.

ayodhya
రాముడి కోసం ముస్లిం మహిళల ప్రత్యేక రాఖీలు
author img

By

Published : Jul 30, 2020, 5:41 PM IST

అయోధ్యలో రామమందిర భూమి పూజకు అంతా సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా అగ్రనేతలు, పూజారుల సమక్షంలో ఆగస్టు 5న అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. రామ మందిర నిర్మాణం జరగాలని ముస్లింలు కూడా ఆకాంక్షిస్తున్నారు. అయోధ్యలోని ముస్లిం మహిళలు అయోధ్య రాముడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం యోగి, ఆర్​ఎస్​ఎస్​ నేత ఇంద్రేశ్ కుమార్ కోసం ప్రత్యేకంగా రాఖీలను సిద్ధం చేస్తున్నారు.

భూమి పూజ సందర్భంగా ధారణ

ప్రధాని మోదీ, సీఎం ఆదిత్యనాథ్, ఇంద్రేశ్​కుమార్​కు రాఖీలను పోస్ట్​ ద్వారా పంపిస్తున్నారు ఈ మహిళలు. ఆగస్టు 5న భూమి పూజ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ద్వారా రాముడి విగ్రహానికి ధరింపజేయనున్నారు.

ఐక్యత కోసం ప్రత్యేక ప్రార్థనలు..

చాలా రోజులుగా ఎదురుచూస్తున్న భూమిపూజ కార్యక్రమం త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు మహిళలు. దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. బాబ్రీ మసీదు- రామ జన్మభూమి వివాదం సుప్రీం తీర్పు ద్వారా తీరిపోయిన నేపథ్యంలో దేశ ప్రజలు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు ఈ మహిళలు.

ఇదీ చూడండి: అయోధ్య రామ మందిర పూజారి, పోలీసులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.