అమెరికాలోని ఫార్మింగ్ టన్ విశ్వవిద్యాలయ బాధిత విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని అమెకికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న విద్యార్థులను కలిసి పరామర్శించినట్లు వెల్లడించారు. వారందరూ క్షేమంగా ఉన్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావొద్దని పిలుపునిచ్చారు. నష్టపోయిన విద్యార్థులకు ఇతర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించేందుకు అమెరికాలో ఉన్న అన్ని తెలుగు సంఘాలు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
