ETV Bharat / bharat

పరువు నష్టం దావా ఉపసంహరించుకున్న అంబానీ - రఫేల్ ఒప్పందం

కాంగ్రెస్, నేషనల్ హెరాల్డ్​ పత్రికపై రూ. 5వేల కోట్లకు దాఖలు చేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకుంటున్నట్లు వ్యాపారవేత్త అనిల్ అంబానీ ప్రకటించారు. రఫేల్​పై కాంగ్రెస్ ఆరోపణలు సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమేనన్నారు.

'రాజకీయ లబ్ధి కోసమే రఫేల్​పై ఆరోపణలు'
author img

By

Published : May 22, 2019, 6:32 AM IST

Updated : May 22, 2019, 8:57 AM IST

రఫేల్​ ఒప్పందం విషయంలో కాంగ్రెస్, నేషనల్ హెరాల్డ్​ పత్రికలపై వేసిన పరువు నష్టం దావాను రిలయన్స్​ గ్రూపుల చైర్మన్​ అనిల్ అంబానీ ఉపసంహరించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్.. రఫేల్​పై ఆరోపణలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. రఫేల్ వ్యవహారం సుప్రీం పరిధిలో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు అనిల్​ అంబానీ.

36 యుద్ధ విమానాల కొనుగోలులో రూ.30వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పార్టీ సభ్యులు చాలా కాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలపై అహ్మదాబాద్​ కోర్టులో రూ.5వేల కోట్ల పరువునష్టం దావాను దాఖలు చేసింది రిలయన్స్ . ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సునీల్ జక్కర్, రణ్​దీప్ సింగ్ సుర్జేవాలా, ఉమెన్ చాందీ, అశోక్ చవాన్, అభిషేక్ సింఘ్వీలను ప్రతివాదులుగా పేర్కొంది.

నేషనల్ హెరాల్డ్ పత్రిక కథనంపై..

రఫేల్​ కొనుగోలు ప్రకటనకు కేవలం 10 రోజుల ముందు అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్​ను స్థాపించారన్న నేషనల్ హెరాల్డ్ కథనంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దావా దాఖలు చేసింది రిలయన్స్​. ఇలాంటి ఆరోపణలు సంస్థ పరువును దెబ్బ తీస్తాయని అంబానీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఇకపై 'డాట్ అమెజాన్' ఇంటర్నెట్​ డొమైన్

Raipur (Chhattisgarh), May 21 (ANI): Two security personnel who got injured in Sukma blast were shifted to Raipur for better treatment today. Security personnel got injured today in an Improvised Explosive Device (IED) blast near Gogunda in Sukma district. Both the security personnel are said to be in a conscious state.
Last Updated : May 22, 2019, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.