మహారాష్ట్రలో ఠానె జిల్లా భివండీలోని పటెల్ కాంపౌండ్లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 10మంది మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న దాదాపు 30మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా కొంత మంది శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.