దేశంలో రోజూ నమోదవుతున్న కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 97,894 కేసులు వచ్చాయి. 1,132 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య 51 లక్షల 18 వేలు దాటింది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం సమర్థమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే రికవరీలూ అదే స్థాయిలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతోంది. 40 లక్షల 25 వేలకు మందికిపైగా కోలుకున్నట్లు తెలిపింది. రికవరీ రేటు 78.64 శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.63 శాతానికి తగ్గింది.
6 కోట్లు దాటిన పరీక్షలు...
కొవిడ్ కట్టడిలో భాగంగా వైరస్ నిర్ధరణ పరీక్షలను భారీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు సంఖ్య 6 కోట్ల 5 లక్షలు దాటినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బుధవారం ఒక్కరోజే 11,36,613 నమూనాలు టెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం