ETV Bharat / bharat

భారత సైన్యానికి 72 వేల అత్యాధునిక తుపాకులు - భారత సైన్యానికి 72 వేల అత్యాధునిక తుపాకులు

భారత్​- చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో.. భారత సైన్యం తమ అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ మేరకు అమెరికా నుంచి త్వరలోనే 72 వేల ప్రత్యేక రైఫిళ్లను దిగుమతి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

72,000 Latest weapons for Indian Army forces
భారత సైన్యానికి 72 వేల అత్యాధునిక తుపాకులు
author img

By

Published : Jul 13, 2020, 6:34 AM IST

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భారత సైన్యం తన అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధాలను చేర్చుకోవడానికి సిద్ధమవుతోంది. అమెరికా నుంచి 72 వేల సిగ్​ సావర్​ అస్సాల్ట్​ రైఫిళ్లను దిగుమతి చేసుకొనే ప్రక్రియను వేగవంతం చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

సరిహద్దుల్లో ఎదురవుతోన్న కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా భారత సైన్యాన్ని శక్తిమంతం చేయాలని 2017లోనే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అత్యాధునిక ఆయుధాలను అందించడానికి చర్యలు ప్రారంభించారు అధికారులు. 7 లక్షల రైఫిళ్లు, 44 వేల మెషీన్​ గన్​లు(తక్కువ బరువుతో కూడినవి), 44,600 కార్బైన్​ తుపాకులు సమకూర్చుకోవడానికి ప్రణాళికలు రచించారు.

అయితే.. 2019కు ముందే సిగ్​ సావర్​ అస్సాల్ట్​ రైఫిళ్లను దిగుమతి చేసుకోవాలనుకున్నా.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ వాయిదాపడింది.

ఇదీ చదవండి: 'భారత భూభాగమంతా భద్రతా దళాల అధీనంలోనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.