లద్దాఖ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించింది.
శుక్రవారం సాయంత్రం 4:27 నిమిషాలకు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. హిమాలయ ప్రాంతాల్లో తరచూ ఇలా భూకంపాలు సంభవిస్తుంటాయని అన్నారు.
ఇదీ చూడండి:బిహార్‌లో ఉద్రిక్తత.. భాజపా-జేఏపీ కార్యకర్తల ఘర్షణ