రైతులకు సంవత్సరానికి రూ.6000 పెట్టుబడి సాయం ఈ రంగానికి మంచి చేసేలా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసంఘటిత రంగాల వారికి పింఛను పథకం బీమా రంగ అభివృద్ధి తోడ్పాటును అందివ్వనుంది. ఈ పథకాలతో సామాన్యుడికి డబ్బు లోటు లేకుండా ఉంటే ... బీమా రంగంలోకి మొగ్గు చూపుతారని నిపుణులంటున్నారు.
"మధ్యంతర బడ్జెట్ పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న పేదలకు మేలు చేసే విధంగా ఉంది. రైతుల ఆదాయాన్ని పెంచే పథకాలు, మధ్యతరగతి వారికి పన్ను భారాన్ని తగ్గిండం, ఒక లక్ష డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేయండం లాంటి పథకాలతో బీమా రంగం పుంజుకుంటుంది"
- భార్గవ్ దాస్గుప్త, సీఈఓ, ఐసీఐసీఐ లామ్బార్డ్
ప్రభుత్వం ఆయూష్మాన్ భారత్ పై దృష్టి పెట్టడంతో ఆరోగ్య బీమా రంగానికి ఎంతో మేలు చేస్తుందని బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్ష్యూరెనస్ సీఈఓ తపన్ సంఘెల్ అన్నారు.