ETV Bharat / bharat

Best Freelance Websites In Telugu: ఫ్రీలాన్సర్​గా పనిచేయాలనుకుంటున్నారా?.. టాప్ 10 ఫ్రీలాన్సింగ్​ వెబ్​సైట్స్ ఇవే! - ఫ్రీలాన్స్ జాబ్స్ మహిళలు

Best Freelance Websites In Telugu : మీరు ఫ్రీలాన్సర్​గా వర్క్ చేద్దామని అనుకుంటున్నారా? ఇంట్లోనే ఉంటూ.. మీకు నచ్చిన పనిచేస్తూ.. చేతినిండా డబ్బులు సంపాదించాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. నేడు ఆన్​లైన్​లో అనేక ఫ్రీలాన్సర్ వెబ్​సైట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని రిలయబుల్​ వెబ్​సైట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Freelance Websites
Best Freelance Websites
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 8:46 AM IST

Best Freelance Websites In Telugu : నేటి యువత ఆఫీస్​కు వెళ్లి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జాబ్స్ చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇంట్లోనే ఉంటూ, తమకు వీలైన సమయంలో, తమకు నచ్చిన పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్య అభ్యసించి కూడా.. సరైన ఉద్యోగం లభించక ఇబ్బంది పడుతుంటారు. వీరు కూడా తమ స్కిల్​కు సరిపోయే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కోసం చూస్తుంటారు. అందుకే ఇలాంటి వారందరికీ ఉపయోగపడే కొన్ని నమ్మదగిన ఫ్రీలాన్సింగ్ వెబ్​సైట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Freelance Websites List :

  1. Fiverr : డిజిటల్ మార్కెటింగ్​, వెబ్​ డెవలప్​మెంట్​, సోషల్​ మీడియా రిలేటెడ్ వర్క్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్​ అని చెప్పవచ్చు. వాస్తవానికి దీనిలో చాలా భిన్నమైన కేటగిరీలు ఉంటాయి. కనుక మంచి కోడింగ్​, డిజైన్ స్కిల్స్ ఉన్నవారికి ఇక్కడ కచ్చితంగా మంచి వర్క్ దొరుకుతుంది. ఈ Fiverr వైబ్​సైట్​లో ఉచితంగా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. పైగా మీ స్కిల్స్​ను ఇంకా ఇంఫ్రూవ్ చేసుకోవడానికి ఆన్​లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ Fiverr వైబ్​సైట్​లో మీరు ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారంటే.. టోటల్ గిగ్​లో 20 శాతం కమిషన్​గా పోగా.. మిగతా 80% మనీ మీ అకౌంట్​లో డిపాజిట్ అయిపోతుంది. ఈ Fiverr వెబ్​సైట్​లో దాదాపు 3.42 మిలియన్ల యాక్టివ్ బయ్యర్లు ఉన్నారు. కనుక మంచి స్కిల్​ ఉండి, పెర్ఫెక్ట్​గా వర్క్ చేసినవారికి మంచి ప్రాజెక్టులు వస్తాయి. దానికి తగ్గ ఆదాయం కూడా లభిస్తుంది.
    Best Freelance Websites
    Fiverr
  2. Freelancer.com : ఈ ఫ్రీలాన్సర్​.కామ్ వెబ్​సైట్​లో.. కంటెంట్ ట్రాన్స్​లేషన్​, వెబ్​ డెవలప్​మెంట్, సోషల్​ మీడియా మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలు, ప్రొఫెషనల్స్ ఇందులో ప్రాజెక్టులు చేస్తుంటారు. కనుక ఈ వెబ్​సైట్​కు బెస్ట్ యూజర్ బేస్ ఉంది. మీకు గనుక హయ్యర్ క్వాలిఫికేషన్​, బెస్ట్ స్కిల్స్ ఉంటే.. వీటిలో మీకు మంచి ప్రాజెక్ట్ రావడం గ్యారెంటీ. దీనిలో ఉన్న మంచి విషయం ఏమిటంటే.. వెబ్​సైట్​ వాళ్లు కమిషన్​గా కేవలం 10% మాత్రమే తీసుకుంటారు. మిగతా 90% అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
    Best Freelance Websites
    Freelancer.com
  3. Upwork : బ్రాండ్​ మార్కెటింగ్​, ప్రోగ్రామింగ్​, వెబ్​సైట్ డిజైనింగ్ లాంటి వర్క్స్ ఇక్కడ లభిస్తాయి. దీనిలో ప్రధానంగా బడ్జెట్ బేస్డ్​ ప్రాజెక్టులు ఉంటాయి. కనుక కొత్తగా ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్లకు కూడా ఇందులో ప్రాజెక్ట్స్​ లభించే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో వెబ్​సైట్​ వాళ్లకు 20% వరకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది.
    Best Freelance Websites
    upwork
  4. Guru : మార్కెటింగ్​, ప్రోగ్రామింగ్​, అడ్మినిస్ట్రేషన్​కు చెందిన ప్రాజెక్టులు ఈ Guru వెబ్​సైట్​లో ఉంటాయి. దీనిలో ఫ్రీ మెంబర్​షిప్ ఫెసిలిటీ ఉంది. అలాగే కస్టమైజ్డ్​ జాబ్ లిస్టింగ్స్ కూడా ఉంటాయి. కనుక చాలా సులువుగా మీ కేటగిరీ ప్రాజెక్టులను వెతుక్కోవచ్చు. కానీ దీనిలో చాలా మంది ఫేక్ క్లైంట్స్ కూడా ఉంటారు. కనుక అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
    Best Freelance Websites
    Guru
  5. Toptal : సాఫ్ట్​వేర్ డెవలప్​మెంట్, ఫైనాన్సియల్​ కన్సల్టింగ్​, ఇంటరిమ్​ మేనేజ్​మెంట్ జాబ్స్ ఇందులో ఉంటాయి. దీనిలో బెస్ట్ కంపెనీలు, టాలెంటెడ్ పీపుల్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ వెబ్​సైట్​లో కేవంల బిగ్​ బడ్జెట్​ ప్రాజెక్టులు మాత్రమే చేస్తూ ఉంటారు. అందుకే హైలీ క్వాలిఫైడ్​, సూపర్ స్కిల్డ్ పీపుల్​కు మాత్రమే ఇందులో ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంటుంది. పేమెంట్​ కూడా భారీగానే ఉంటుంది.
    Best Freelance Websites
    Toptal
  6. Jooble : కంటెంట్ రైటింగ్​, గ్రాఫిక్ డిజైన్​, డేటా ఎంట్రీ జాబ్స్ చేయాలని అనుకునేవారికి Joobly బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిలో లక్షలాది ప్రాజెక్టులు ఉంటాయి. అయితే వాటిలో మీకు నచ్చిన వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు గనుక ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఈ-మెయిల్ ద్వారా అలర్ట్ వస్తుంది.
    Best Freelance Websites
    Jooble
  7. Flexjobs : కంటెంట్​ రైటింగ్​, కంటెంట్ మార్కెటింగ్​, ట్రాన్స్​క్రిప్షన్​ వర్క్​లు ఇందులో లభిస్తాయి. అంతేకాదు ఇందులో స్కామ్​-ఫ్రీ ప్రొటక్షన్ కూడా ఉంటుంది. కానీ ఇందులో పనిచేయాలంటే సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
    Best Freelance Websites
    Flexjobs
  8. LinkedIn : కాపీ రైటింగ్, ట్రాన్స్​లేషన్​, గ్రాఫిక్ డిజైన్​ లాంటి ప్రాజెక్టులు ఇందులో ఉంటాయి. అంతేకాదు నెట్​వర్క్ ఆపర్చూనిటీస్​, రీసెంట్ న్యూస్ అప్​డేట్స్​, జాబ్​ అప్​డేట్స్ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ ప్లాట్​ఫాంలో చాలా వరకు నకిలీ యూజర్లు ఉంటారు. కనుక ప్రాజెక్టులు చేసే ముందు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది.
  9. SimplyHired : హ్యూమన్ రిసోర్స్​, ఫైనాన్స్​, డేటా ఎంట్రీ లాంటి ప్రాజెక్టులు ఇందులో ఉంటాయి. అంతేకాదు.. ఇందులో ఫ్రీ జాబ్​ టూల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
  10. 99designs : వెబ్​ డెవలప్​మెంట్​, లోగో, గ్రాఫిక్ డిజైన్ లాంటి వర్క్స్​ ఇందులో ఉంటాయి. ఇందులో పేమెంట్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే మీరు చేసే ప్రాజెక్టుకు కచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ ఈ ప్లాట్​ఫాం వాళ్లు 5% నుంచి 15% వరకు కమిషన్​ను వసూలు చేస్తారు.

ఇవే కాదు.. ఆన్​లైన్​లో వెతికితే.. ఇంకా చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్​సైట్స్ కనిపిస్తాయి. అయితే వీటిలో చాలా వరకు నకిలీ వెబ్​సైట్స్​ కూడా ఉంటాయి. కనుక వీలైనంత వరకు పాపులర్ వెబ్​సైట్​లను ఎంచుకోవడమే మంచిది.

సొంతంగా వెబ్​సైట్​ : మీరు కనుక సొంతంగా వెబ్​సైట్​ క్రియేట్​ చేసుకుంటే.. అందులోనే చాలా సులువుగా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే, అది సక్సెస్ కావడానికి కాస్త సమయం పట్టవచ్చు. కానీ ఒకసారి అది క్లిక్ అయ్యిందంటే.. ఇకమీరు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

Salary Negotiation Tips : జీతభత్యాలు గురించి మాట్లాడాలా?.. ఈ టిప్స్​తో బెస్ట్ ప్యాకేజీ గ్యారెంటీ!

How To Success In Interview : ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా?.. ఈ టిప్స్​ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.