India China border: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల వెంట చైనా మౌలిక సదుపాయాలను మరింత పెంచుతోందని భారత సైన్యం తెలిపింది. బలగాల మరింత సులభంగా తరలించేందుకు వీలుగా రోడ్డు, రైలు, విమాన సేవల అనుసంధాన వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందని భారత సైన్యం తూర్పు కమాండ్ అధిపతి లెఫ్ట్‌నెంట్ జనరల్ ఆర్.పి.కలీటా వెల్లడించారు. చైనా కదలికలను గమనిస్తున్న భారత సైన్యం కూడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ, లద్దాఖ్ సెక్టార్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఆరు డివిజన్ల సైనిక బలగాలను మోహరించింది. ఇంతవరకు దాయాది దేశం పాకిస్థాన్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ప్రాధాన్యమిస్తూ వచ్చిన సైన్యం... ఇప్పుడు చైనాపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో దశలవారీగా బలగాల మోహరింపులో మార్పులు చేస్తోంది. జమ్ము కశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసే రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ డివిజన్‌ను తూర్పు లద్దాఖ్‌కు సైన్యం పంపించింది. రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన డివిజన్లను హరియాణ, ఉత్తరాఖండ్, అసోం తదితర రాష్ట్రాల సరిహద్దుల్లో సైనిక దళాలు మోహరించనున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు.
ఇదీ చదవండి: