CBN Bail Petition : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగియగా.. న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది దూబే.. చంద్రబాబును ఇప్పటికే పోలీసు కస్టడీకి ఇచ్చారని వాదించారు. 15 రోజుల రిమాండ్ సమయంలో పోలీసు కస్టడీకి ఇచ్చారని, తిరిగి రెండోసారి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అనంతరం కోర్టు బయట మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటికే 13 మంది బెయిల్‌పై ఉన్నారని వాదించామని తెలిపారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. గుజరాత్‌లో సీమెన్స్ కార్యకలాపాలపై ఇక్కడి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని, నగదు లావాదేవీల్లో సీఎంకు ఎలాంటి పాత్ర ఉండదని వాదించాం.. పార్టీ ఖాతాలోకి అక్రమంగా డబ్బు వచ్చిందన్న ఆరోపణ అసత్యం అని వెల్లడించారు.