దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఫిట్‌గా ఉంటేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అయ్యేనాటికి దేశం 'ఫిట్ ఇండియా'గా మారాలని ఆకాంక్షించారు.
అనురాగ్ ఠాకూర్, నితీశ్ ప్రమానిక్.. దిల్లీలో జెండా ఊపి.. ఫిట్ ఇండియా రన్‌ను ప్రారంభించారు.
మహారాష్ట్రలో గేట్ ఆఫ్ ఇండియా వద్ద ఫిట్ ఇండియా రన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 40 మంది ఎన్ఎస్జీ కమాండోలు రన్లో పాల్గొన్నారు.
పంజాబ్ అమృత్‌సర్‌లోని అతారి-వాఘా బార్డర్ వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు ఫిట్ ఇండియా రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఫిట్ ఇండియా 2.0ను ప్రారంభించినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 75 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించామని పేర్కొన్నారు. అక్టోబర్ 2 వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'ఫిట్ ఇండియా.. ప్రజా ఉద్యమంలా మారాలి'