ETV Bharat / bharat

Sake Bharati PhD story: పట్టుదలే ఆయుధం.. పీహెచ్​డీ పట్టా సాధించిన కూలీ - sri krishna devaraya university news

Nagulaguddem resident Bharati PhD story: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వివాహిత కూలీనాలీ పనులు చేస్తూ..శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసి..అందరిచేత ప్రశంసలు అందుకుంది. చదువుకోవాలనే తపన, నిరీక్షణ, శ్రమించేతత్త్వం ఉంటే..పేదరికం, పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు చదువుకు అడ్డుకాదని నిరూపించింది.

doctor sake bharathi
doctor sake bharathi
author img

By

Published : Jul 19, 2023, 6:42 PM IST

Updated : Jul 20, 2023, 3:53 PM IST

పట్టుదలే ఆయుధం.. పీహెచ్​డీ పట్టా సాధించిన కూలీ

Nagulaguddem resident Bharati PhD story: అదొక అత్యంత నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఓవైపు కూలీనాలీ పనులు. మరోవైపు కుటుంబ బాధ్యతలు. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువుకోవాలనే తపన. పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రొఫెసర్ అవ్వాలనే కల. పెళ్లై, ఓ బిడ్డ పుట్టిన తన కల దిశగా అడుగులు వేసింది. భయంకరమైన పరిస్థితులు వెంటాడినా తన కలను సాకారం చేసుకోవటం కోసం రాత్రి, పగలు కష్టపడి చదివింది. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్రంలో 'బైనరీ మిక్చర్స్' అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకుంది. చదువుకోవాలనే ఆశ, నిరీక్షణ, శ్రమించేతత్త్వం ఉన్న నేటి యువతకు, మహిళలకు ఆదర్శంగా నిలిచింది. పేదరికం, పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు చదువుకు అడ్డుకాదని నిరూపించింది. తాజాగా యూనివర్సిటీలో నిర్వహించిన 11వ కాన్వొకేషన్‌ వేడుకల్లో పాల్గొని.. అందరిచేత శభాష్ అనిపించుకుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు..? పీహెచ్‌డీ స్థాయికి చేరుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి..?, ఆమె విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న సంఘటనలేమిటి..? అనే వివరాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

కూలీ పనులు చేస్తూ ఉన్నత విద్య.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డెంకు చెందిన సాకె భారతిది అత్యంత నిరుపేద కుటుంబం. భారతి తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. వారిలో భారతి పెద్దది. చిన్నప్పటి నుంచి తల్లితోపాటు కూలీనాలీ పనులకు వెళ్తూ.. కుటుంబ భారాన్ని పంచుకుంది. ఓవైపు కూలీ పనులకు వెళ్తూనే.. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునేది. నాగులగుడ్డెంలో సుమారు 30 మంది పదవ తరగతి విద్యార్థులుండగా, వాళ్లందరికంటే భారతి అత్యధిక మార్కులు సాధించి.. ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మేనమామ శివప్రసాద్‌తో ఆమెకు వివాహం జరిగింది. కానీ, ఉన్నతంగా చదివి స్థిరపడాలనేది భారతి చిరకాల కోరిక.

కూలీ డబ్బులతో పీహెచ్‌డీ చదువు.. ఈ క్రమంలో భారతి అత్తగారింటి కుటుంబం కూడా రెక్కాడితే గానీ డొక్కాడని స్థితి. దీంతో తన చదువును కొనసాగించే విషయాన్ని భారతి అటు మెట్టింటివారికి గానీ, ఇటు భర్తకు గానీ చెప్పలేకపోయింది. కానీ, ఆమె పుస్తకాలను చదవటం మాత్రం ఆపలేదు. భార్య ఆసక్తిని గుర్తించిన భర్త శివప్రసాద్.. తన కూలిసొమ్ముతో చదివిస్తానని ఆమెకు హామీ ఇచ్చాడు. ఆ హామీతో భారతికి కొండంత ధైర్యం వచ్చింది. తాను కూడా రెట్టింపు ఉత్సహాంతో పని చేస్తూ.. ఇద్దరి కూలీ డబ్బులతో తన చదువును, కుటుంబ పోషణను చూసుకుందామని భర్త కష్టంలో పాలుపంచుకుంది. కూలీ డబ్బులతో ఆమె తన చదువును కొసాగించటం మొదలుపెట్టి పీహెచ్‌డీ స్థాయికి చేరుకుంది.

ప్రతిభను గుర్తించిన అధ్యాపకులు.. భారతి ఇంటర్ విద్యను పామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేయగా.. బీఎస్సీ డిగ్రీ, ఎమ్మెస్సీలను అనంతపురంలోని ఎస్ఎస్‌బీఎన్ కళాశాలలో పూర్తి చేసింది. ఏడు సంవత్సరాలపాటు ఓరోజు కూలీకి వెళ్తూ మరొక రోజు కాలేజీకి వెళ్తూ డిగ్రీ, ఎమ్మెస్సీలను పూర్తి చేసింది. అంతేకాదు, కళాశాలకు వెళ్లొచ్చిన తర్వాత ఇంటి పనులతోపాటు, గోవుల పోషణను కూడా చూసుకునేది. ఈ నేపథ్యంలో రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసిన భారతి ప్రతిభను గుర్తించిన ఆ కళాశాల (ఎస్ఎస్‌బీఎన్) అధ్యాపకులు ఆమెను.. పీహెచ్‌డీ చేయమని ప్రోత్సహించారు. కానీ, తనకు అంత ఆర్థిక స్తోమత లేదని, కూలీకి వెళ్తే గానీ జీవనం సాగని కుటుంబమని అధ్యాపకులు తన పరిస్థితిని తెలియజేసింది. ఆ తర్వాత పీహెచ్‌డీ విషయాన్ని పక్కకు పెట్టి.. కుటుంబ పోషణనకై కూలీనాలీ పనులు చేయటంలో నిమగ్నమైపోయింది.

రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి.. అయితే, ఓరోజు భారతి భర్త శివప్రసాద్‌కు పశువుల పేడ దిబ్బలో యూనివర్సిటీలో పీహెచ్‌డీ నోటిఫికేషన్ వచ్చిన ఓ కాగితం దొరికింది. దాన్ని చదివిన శివప్రసాద్.. పీహెచ్‌డీకి దరఖాస్తు చేయాలని భార్యను ప్రోత్సహించాడు. దీంతో ఆమె దరఖాస్తు చేయగా.. అనంతపురం జిల్లాలో ఉన్న శ్రీ కృష్ణదేవరాయ యూవర్సిటీ (ఎస్కేయూ)లోని రసాయన శాస్త్రం విభాగంలో పీహెచ్‌డీ సీటు వచ్చింది. దీంతో ఆమె ఆచార్య డా.శుభ దగ్గర పరిశోధన విద్యార్థిగా చేరి.. రసాయన శాస్త్రంలో' బైనరీ మిక్చర్స్' అనే అంశాన్ని ఎంచుకుని పరిశోధనను ప్రారంభించింది. భార్య, భర్తలు కూలీకి వెళ్లి వచ్చిన సంపాదనతో భారతి తన పీహెచ్‌డీని పూర్తి చేసుకుని ఇటీవలే డాక్టరేట్ పట్టాను అందుకుంది.

''నాగులగుడ్డెం ఊరి చివర్లో ఓ చిన్నపాటి రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నాం. చిన్నప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూనే పై చదువులు చదువుకున్నాను. పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రొఫెసర్ అవ్వాలని నా కోరిక. నా భర్త, నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఎస్కేయూలో పీహెచ్‌డీ పూర్తి చేసుకున్నాను. సోమవారం రోజున రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాతోపాటు 'డాక్టర్' అనే పేరును సంపాదించాను. కష్టపడి చదివి ప్రొఫెసర్ అవుతాను. ఇందుకు ప్రభుత్వం గానీ దాతలు గానీ ముందకొచ్చి ఆర్థిక సహాయం అందిస్తే.. నా కలను సాకారం చేసుకుంటాను.'' -డాక్టర్ భారతి, నాగులగుడ్డెం

Last Updated : Jul 20, 2023, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.