ETV Bharat / bharat

కాబుల్​ నుంచి స్వదేశానికి భారతీయులు- ఎంబసీ సేవలు యథాతథం! - అఫ్గాన్​

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడున్న మన అధికారులను స్వదేశానికి తీసుకొచ్చింది. 120 మంది భారత అధికారులున్న వాయుసేన విమానం కాబుల్​ విమానాశ్రయం నుంచి గుజరాత్​లోని జామ్​నగర్ మీదుగా దిల్లీకి చేరుకుంది. అయితే, రాయబార కార్యాలయంలో కాన్సులర్ సేవలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

కాబూల్ నుంచి యుద్ధ విమానంలో భారత అధికారులు
యుద్ధ విమానంలో అఫ్గాన్​ నుంచి భారత అధికారుల తరలింపు
author img

By

Published : Aug 17, 2021, 10:25 AM IST

Updated : Aug 17, 2021, 5:59 PM IST

అఫ్గానిస్థాన్​లో చిక్కుకున్న భారత అధికారులను స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం. 120 మంది అధికారులను కాబుల్​ విమానాశ్రయం నుంచి సీ-17 మిలిటరీ రవాణా విమానంలో భారత్ తీసుకొచ్చింది. గుజరాత్​ జామ్​నగర్​లో ఈ విమానం ల్యాండ్ అయింది. ఇంధనం నింపుకొన్న అనంతరం దిల్లీకి చేరుకుంది.

Indian officials
గుజరాత్ చేరుకున్న భారత అధికారులు

వీరందరినీ సోమవారం సాయంత్రమే కాబుల్ విమానాశ్రయంలో సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం విమానం బయలుదేరే వరకు వారికి భద్రత కల్పించినట్లు పేర్కొన్నాయి.

Indian officials
గుజరాత్ చేరుకున్న భారత అధికారులు

'ఎంబసీని మూసేయలేదు'

అయితే, కాబుల్​లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్థానిక సిబ్బంది కాన్సులర్ సేవలను అందిస్తున్నారని స్పష్టం చేశాయి. భారత్​కు తిరిగి వచ్చేందుకు 1,650 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించాయి.

ఎలక్ట్రానిక్ వీసాలు

అఫ్గాన్..​ తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కొత్త కేటగిరీ వీసాలను ప్రకటించింది కేంద్ర హోంశాఖ. భారత్​కు రావాలనుకునే అఫ్గానీల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్​ వీసా విధానాన్ని తీసుకొచ్చింది. 'ఇ-ఎమర్జెన్సీ ఎక్స్​-మిస్క్​ వీసా' పేరుతో దీన్ని ప్రకటించింది. అఫ్గాన్​లో ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అమెరికా-భారత్ చర్చలు

కాబుల్​లో విమాన కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. సోమవారం న్యూయార్క్​కు చేరుకున్న జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​తో ఫోన్​లో మాట్లాడారు. అఫ్గాన్​లో పరిస్థితిపై ఇరువురు చర్చించారు. విమాన సేవలు పునరుద్ధరించే విషయంలో అమెరికా చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

అఫ్గాన్​లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు జైశంకర్ స్పష్టం చేశారు. 'భారత్​కు తిరిగి రావాలనుకుంటున్న వారి ఆందోళనను అర్థం చేసుకోగలం. ఎయిర్​పోర్ట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటం వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనిపై చర్చలు జరుపుతున్నాం' అని ట్వీట్ చేశారు. కాబుల్​లోని హిందూ, సిక్కు మత పెద్దలతో మాట్లాడుతున్నామని, వారి సంక్షేమమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

కాబుల్ నుంచి భారత అధికారులను ఖాళీ చేయించే విషయంపైనా అమెరికా అధికారులతో జైశంకర్ విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

భయాందోళనలు

20 ఏళ్ల తర్వాత తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రాణభయంతో దేశం వీడి వెళ్లిపోవాలని సోమవారం కాబుల్ ఎయిర్​ పోర్టుకు వేల సంఖ్యలో అఫ్గానీలు వచ్చారు. దీంతో విమానాశ్రయం బస్​ స్టేషన్​ను తలపించింది. కొందరైతే విమానం రెక్కలు పట్టుకుని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విమానం టేకాఫ్ అయ్యాక కిందపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: Viral: విమానం నుంచి జారిపడిన అఫ్గాన్​ ప్రజలు

అఫ్గాన్​ లో సిటీ బస్సులు- విమానాలు ఒకటే!

వీధుల్లో నిశ్శబ్దం.. గుండెల్లో అలజడులు

Last Updated : Aug 17, 2021, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.