ETV Bharat / bharat

ఉద్రిక్తతల మధ్య బంగాల్​ పంచాయితీ పోలింగ్ షురూ.. కేంద్ర బలగాలతో పటిష్ఠ బందోబస్తు - tmc latest news

Bengal Panchayat Election 2023 : ఉద్రిక్తతల మధ్య బంగాల్‌ పంచాయతీ ఎన్నికలు శనివారం ప్రారంభం అయ్యాయి. 22 జిల్లా పరిషత్‌లలోని 928 స్థానాలకు, 9,730 పంచాయతీ సమితులకు, 63,229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Bengal Panchayat Election 2023
Bengal Panchayat Election 2023
author img

By

Published : Jul 8, 2023, 7:00 AM IST

Updated : Jul 8, 2023, 7:51 AM IST

Bengal Panchayat Election 2023 : 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు అగ్నిపరీక్షలా మారిన బంగాల్‌ పంచాయతీ ఎన్నికలు శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాయి. 22 జిల్లా పరిషత్‌లలోని 928 స్థానాలకు, 9,730 పంచాయతీ సమితులకు, 63,229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగుతున్నాయి. 5.67 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 1970 చివర్లో బంగాల్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత కేంద్ర బలగాల పర్యవేక్షణలో పంచాయతీ ఎన్నికలు జరగడం ఇది రెండోసారి. 65వేల కేంద్ర రిజర్వ్‌డ్‌ పోలీసు సిబ్బందితో పాటు 70వేల మంది బంగాల్‌ పోలీసులను మోహరించారు. బంగాల్‌ జనాభాలో దాదాపు 65శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. 42పార్లమెంట్ స్థానాల్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం వల్ల అధికార, విపక్షాలకు, పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. శనివారం ఒకే దశలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు జూలై 11న జరగనుంది.

  • #WATCH | Voters standing in a queue outside a polling booth in Dinhata, Cooch Behar ahead of voting for West Bengal Panchayat elections.

    Voting for Panchayat elections will begin at 7am. pic.twitter.com/IJ2M7VFIfy

    — ANI (@ANI) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హింసాత్మక ఘటనలు..
అయితే, పోలింగ్​ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. కాంగ్రెస్ కార్యకర్తపై టీఎంసీ కార్యకర్త కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రచారం చేసి ఇంటికి వెళ్తున్న తనను టీఎంసీ కార్యకర్తలు తుపాకీతో కాల్చారని బాధితులు చెప్పారు. ప్రజలను ఓటేయనీయకుండా అడ్డుకుంటోందని టీఎంసీపై కాంగ్రెస్ మండిపడింది.

  • West Bengal: A Congress-CPIM alliance worker got injured after he was allegedly shot at by TMC workers in Cooch Behar

    "I was going out of my house after having food when TMC people shot me. Congress-CPIM will get good votes here so TMC is doing this to stop people from voting,"… pic.twitter.com/huQZcBKT8v

    — ANI (@ANI) July 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'అన్నింటికీ పరిష్కారం ఓటే'
ఎన్నికల నేపథ్యంలో గవర్నర్​ సీవీ ఆనంద బోస్​ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలందరూ నిరాశలో ఉన్నారని.. హింస చెలరేగడం వల్ల భయంతో జీవిస్తున్నారని చెప్పారు. వీటన్నింటికీ పరిష్కారం శనివారం జరిగే ఎన్నికలే అని తెలిపారు. హింస, అవినీతికి శాశ్వత పరిష్కారం ఓటు హక్కుతోనే పొందుతామన్నారు.

"ప్రతి ఒక్కరూ పోలింగ్​ బూత్​లకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం రేపు మీరు వేసే ఓటే. ప్రజాస్వామంలో ఓటు హక్కు అత్యంత శక్తిమంతమైనది. నేను పబ్లిసిటీ కోసమే చేస్తున్నాను. సాధారణ వ్యక్తి హక్కులు, రాజ్యాంగ పవిత్రత కోసం ప్రచారం చేస్తున్నాను."
--సీవీ ఆనంద బోస్, గవర్నర్​

'గవర్నర్​ను తొలగించి బయటకు పంపాలి'
గవర్నర్ ఆనంద బోస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీఎంసీ నేత మదన్ మిత్రా. గవర్నర్​ను.. ఆ పదవితో పాటు బంగాల్​ నుంచి కూడా పంపించాలని డిమాండ్ చేశారు. గవర్నర్​.. బీజేపీకి ఓటు వేయమని ఎలా అభ్యర్థిస్తారు అని ప్రశ్నించారు. ఆయన తమ రాష్ట్ర ఓటరు కాదని.. వెంటనే బంగాల్​ నుంచి బయటకు పంపాలని కోరారు.

జూన్​ 8న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ టీనేజర్​ సహా 10మందికిపైగా మరణించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో పటిష్ఠం బందోబస్తును ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాల పర్యవేక్షణతో పోలింగ్ నాటికి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ సీవీ ఆనంద బోస్​, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం జరిగింది.

Last Updated : Jul 8, 2023, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.