ETV Bharat / bharat

అంబానీ కుటుంబానికి మరో బెదిరింపు కాల్.. ఫ్యామిలీ మెంబర్ల పేర్లు చెప్పి మరీ.. - ambani family threat calls

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్​ వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి ఓ ఆగంతుకుడు కాల్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంబానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యుల పేర్లతో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబయి పోలీసులు తెలిపారు.

AMBANI FAMILY THREATENED AGAIN AFTER ANTILIA CASE

author img

By

Published : Oct 5, 2022, 4:11 PM IST

Ambani family threatened: భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌లోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని ముంబయి పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఆస్పత్రిని పేల్చేస్తామని దుండగుడు బెదిరించారు. అంబానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యుల పేర్లు చెప్పి మరీ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

ఇంతకుముందు ఆగస్టు 15న కూడా అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని 3 గంటల్లో చంపేస్తామని ఓ ఆగంతుకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్​కు ఈ కాల్ వచ్చినట్లు చెప్పారు. ఏకంగా ఎనిమిది సార్లు దుండగుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బెదిరింపు కాల్స్​పై ఆస్పత్రి వర్గాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. వెంటనే అంబానీ నివాసానికి పెద్ద సంఖ్యలో సిబ్బందిని పంపారు. ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ముంబయి దహిసర్​లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

గతంలోనూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. గతేడాది ఆయన నివాసం అంటిలియా వద్ద పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో కనిపించడం కలకలం రేపింది. కొందరు దుండగులు జిలెటిన్ స్టిక్స్ ఉన్న కారును అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా.. అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లేఖ లభ్యమైంది.

ఇవీ చదవండి: ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. డైరెక్టర్​ ఫ్యామిలీలో ముగ్గురు సజీవదహనం!

కుప్పకూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్- ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.