ETV Bharat / bharat

వీడియో తీస్తున్నప్పుడు తెలియదు ఆమెకు.. ఇదే చివరిదని! - కేరళ ఇడుక్కి

ఓ వైపు భారీ వర్షం... మరోవైపు ఇంట్లోకి చొచ్చుకొస్తున్న వరద నీరు.. ఇలాంటి సమయంలో ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఆ ఇంట్లో ఉంది. అంతలోనే భారీ కొండచరియలు విరిగిపడగా.. ఆ చిన్నారులతో పాటు ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. (Kerala flood)

kerala floods 2021
కేరళ వరదలు 2021
author img

By

Published : Oct 18, 2021, 7:10 PM IST

మరణించే ముందు తీసిన వీడియో

ఆకస్మిక వరదలకు (Kerala flood 2021) కొండ చరియలు విరిగిపడటం వల్ల కేరళ (Kerala flood) ఇడుక్కిలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అందులోని నలుగురు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు.

ఘటనకు ముందు.. ఇంట్లోని ఓ మహిళ వీడియో తీసింది. లోపలకు భారీగా వస్తున్న వర్షపు నీటిని (Kerala flood 2021 latest news) కెమెరాలో రికార్డు చేసి.. తన కుటుంబ సభ్యులకు పంపించింది. అయితే, కాసేపటికే ఆ ఇల్లు వరదకు తుడిచిపెట్టుకుపోయింది. వీడియో తీస్తున్న సమయంలో వర్షపు నీరు కొద్దికొద్దిగా మెట్లపై నుంచి ఇంట్లోకి వస్తోంది. ఇద్దరు చిన్నారులు సైతం వీడియోలో కనిపిస్తున్నారు. అయితే, ఇవే తమ ఆఖరి క్షణాలని వీరు తెలుసుకోలేకపోయారు.

kerala flood video
వీడియోలో కనిపిస్తున్న చిన్నారులు

ఒకే కుటుంబంలో ఐదుగురు

వీడియో తీసిన తర్వాత మహిళ ఇంటికి సమీపంలో భారీ స్థాయిలో కొండచరియలు (Kerala landslide 2021) విరిగిపడ్డాయి. వరద ముంచెత్తింది. ఫలితంగా ధ్వంసమైన ఇంటి శిథిలాల కింద పడి మొత్తం ఆరుగురు మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందినవారు ఐదుగురు ఉన్నారు. మృతదేహాలను ఆదివారం.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏడేళ్ల బాలిక, నాలుగేళ్ల బాలుడి మృతదేహాలు ఒకరినొకరు హత్తుకొని ఉన్నట్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. మరణ భయంతో చిన్నారులిద్దరూ ఒకే దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. 55 ఏళ్ల మహిళ శవం మణిమాల నదిలో లభ్యమైంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.