ETV Bharat / bharat

వరదలో చిక్కుకున్న నిండు గర్భిణీని కాపాడిన ఎన్డీఆర్​ఎఫ్ - 9 month pregnant rescued in kerala

నిండు గర్భిణీని నది దాటించింది విపత్తు నిర్వహణ బృందం. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగుతున్న నది నుంచి పడవలో ఒడ్డుకు చేర్చింది. ఈ ఘటన కేరళ నీలంబూర్​లో జరిగింది.

pregnant rescued from flood
వరదల నుంచి రక్షించిన అధికారులు
author img

By

Published : Jul 24, 2021, 9:07 AM IST

గర్భిణీని వరదల నుంచి రక్షించి

భారీ వర్షాలు కేరళను ముంచెత్తాయి. వరద నీరు చేరటం వల్ల నీలంబూర్ జిల్లాలోని చలియార్ నది పొంగిపొర్లుతోంది. మలప్పురంలో.. నది అవతలి గ్రామాల్లో చిక్కుకున్న దాదాపు 200 మందిని ఒడ్డుకు చేర్చారు ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది. ఇదే సమయంలో గ్రామంలో చిక్కుకున్న తొమ్మిదినెలల గర్భిణీ రాధిక, మరో యువతి సింధును విపత్తు నిర్వహణ బృందం రక్షించింది.

ఉప్పొంగతున్న నది నుంచి పడవల ద్వారా ఒడ్డుకు చేర్చిన రాధికను పునరావాస కేంద్రానికి తరలించగా.. సింధును స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: సిలిండర్​ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.