ETV Bharat / bharat

మూడొంతుల మురుగు నీరు నదుల్లోకే!

author img

By

Published : Oct 4, 2022, 7:38 AM IST

"ప్రస్తుతం దేశంలోని పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో 28% (రోజుకు 20,236 మిలియన్‌ లీటర్లు) మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలిన 72% శుద్ధిచేయని మురుగునీరు నదులు, సరస్సులు, భూగర్భంలో కలుస్తోంది. దానివల్ల ఆ జలవనరుల్లోని నీరు కలుషితమై నాణ్యత దిగజారుతోంది." అని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది.

niti aayog sewage water report
మూడొంతుల మురుగు నీరు నదుల్లోకే!

దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో కేవలం 28% మాత్రమే శుద్ధి అవుతోందని, మిగిలిన 72% నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళుతోందని నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన 'అర్బన్‌ వేస్ట్‌ వాటర్‌ సినారియో ఇన్‌ ఇండియా' అన్న నివేదికలో పేర్కొంది. అందువల్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నీటి శుద్ధీకరణ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. "ప్రస్తుత దేశ జనాభా 138 కోట్లు. అందులో 65% (90 కోట్లమంది) గ్రామీణప్రాంతాల్లో ఉంటే 35% మంది (48 కోట్లమంది) పట్టణప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజూ 39,604 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంటే, పట్టణ ప్రాంతాల నుంచి 72,368 మిలియన్‌ లీటర్లు వస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరగడంతో నీటి వినియోగం పెరిగింది.

రోజుకు 28 శాతమే శుద్ధి
ప్రస్తుతం దేశంలోని పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో 28% (రోజుకు 20,236 మిలియన్‌ లీటర్లు) మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలిన 72% శుద్ధిచేయని మురుగునీరు నదులు, సరస్సులు, భూగర్భంలో కలుస్తోంది. దానివల్ల ఆ జలవనరుల్లోని నీరు కలుషితమై నాణ్యత దిగజారుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని 323 నదుల పరిధిలోని 351 పాయల్లో ప్రవహించే నీటి నాణ్యతను బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) ద్వారా కొలుస్తోంది. దాని ప్రకారం 13% భారతీయ నదీ పాయలు తీవ్రంగా కలుషితం అయ్యాయి. బీఓడీకి తోడు కెమికల్‌ ఆక్సిజన్‌ స్థాయి, భారలోహాలు, ఆర్సెనిక్‌, ఫ్లోరైడ్స్‌, ప్రమాదకరమైన రసాయనాలు అత్యధికచోట్ల కనిపించాయి. మరీ ముఖ్యంగా భూగర్భజలాల్లో వీటి శాతం ఎక్కువ కనిపించింది. అందువల్ల ఉత్పత్తి అవుతున్న, శుద్ధిచేస్తున్న నీటి మధ్య ఉన్న అగాధాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది.

వ్యర్థ జలాలను విలువైన వనరుగా వాడుకోవాలి. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాట్లలో సవాళ్లు ఎదురు కావడమే ఈ అగాధానికి కారణమవుతోంది. పట్టణప్రాంతాల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి లేకపోవడం, మురుగునీటి పారుదల వ్యవస్థను మ్యాపింగ్‌ చేయకపోవడం, లీకేజీలను గుర్తించకపోవడం, వ్యర్థజలాలను చట్టవిరుద్ధంగా ఎక్కడో ఒకచోట వదిలేస్తుండడం వంటివి ప్రధాన సమస్యగా మారాయి. మురుగునీటి శుద్ధి ఖర్చును తగ్గించే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకపోవడం, శుద్ధిచేసిన నీటిని మళ్లీ ఉపయోగించడానికి ప్రజలు విముఖత చూపడం కూడా లక్ష్యానికి అడ్డంకిగా మారింది. అందువల్ల ఈ సవాళ్లను తొలగించి మురుగునీటిని చౌకగా శుద్ధిచేసి, మళ్లీ ఉపయోగించే కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అంది పుచ్చుకోవాలి.

శుద్ధిచేసిన నీటిపై నమ్మకం కలిగించాలి
శుద్ధిచేసిన నీటి నాణ్యతపై వినియోగదారులకు నమ్మకం కలిగించాలి. అది మనుషుల ఆరోగ్యం, పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయదనే విశ్వాసాన్ని బలంగా కల్పించగలగాలి. మురుగునీటి శుద్ధికి ప్రాకృతిక పరిష్కారమార్గాలు అనుసరించాలి. శుద్ధిచేసిన నీటిని తిరిగి ఉపయోగించడంవల్ల ఎలాంటి నష్టం లేదన్న విషయాన్ని ప్రజలకు విస్తృతంగా అందుబాటులో ఉంచాలి. మురుగునీటిని శుద్ధిచేసి ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశ సుస్థిరాభివృద్ధికి అది అంత సమర్థంగా ఉపయోగపడుతుంది" అని నీతి ఆయోగ్‌ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.