గుజరాత్, అహ్మదాబాద్‌లోని బరేజా ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది కూలీలు మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా కూలీపనుల కోసం.. మధ్యప్రదేశ్, గుణ జిల్లా నుంచి గుజరాత్‌కు వచ్చారు. స్థానికంగా ఉన్న బాదం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.


ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటన మరణించిన వారికి స్థానిక ఎమ్మెల్యే కూడా నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.


ఈ ఘటనపై మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : ఉగ్రవాదుల ఏరివేత- 98మంది హతం!