ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. వీరిలో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు అప్పులే ప్రధాన కారణమని వివరించారు.
అప్పుల వల్లే..
అశోక్ విహార్ కాలనీలో నివసించే సంజీవ్ జోషి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతనికి తల్లి నందనీ జోషి, భార్య అర్చన, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతనికి కొన్ని అప్పులు ఉన్నాయని.. వారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఐదుగురు వ్యక్తులు ఎలుక మందు తాగారని పోలీసులు తెలిపారు. జోషితో పాటు.. అతని భార్య, పెద్ద కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతని తల్లి, చిన్న కుమార్తె మరణించినట్లు స్పష్టం చేశారు. ఆత్మహత్యకు ముందు తమ పెంపుడు శునకానికి కూడా విషం ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు.
ఆత్మహత్య చేసుకునేందుకు కుటుంబమంతా కలసి శీతల పానీయంలో ఎలుకలను చంపేందుకు ఉపయోగించే మందు(విషం) కలుపుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనితో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఆసుపత్రికి తరలించారు.
'తమ ఆత్మహత్యకు అప్పులే కారణమని' రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రాజేష్ సింగ్ భదౌరియా తెలిపారు. అందుకు కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: