ETV Bharat / snippets

'ఇండియాస్‌ స్పేస్‌ సాగా'- భారత్​ చరిత్ర లిఖించి ఏడాది పూర్తి- '2035లో సొంత అంతరిక్ష కేంద్రం'!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 10:12 AM IST

National Space Day
National Space Day (ANI, Sansad TV)

National Space Day : అంతరిక్షరంగంలో భారత్‌ సగర్వంగా సరికొత్త చరిత్ర లిఖించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అమెరికా, రష్యా, చైనాలకు సాధ్యపడని జాబిల్లి దక్షిణధ్రువంపై ఇస్రో పంపిన ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ప్రగ్యాన్‌లు సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజే దిగాయి. ఆ సుదినానికి గుర్తుగా ఇవాళ తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఈ ఏడాది 'టచింగ్‌ లైవ్స్‌ వైల్‌ టచింగ్‌ మూన్‌ ఇండియాస్‌ స్పేస్‌ సాగా' నేపథ్యంతో నేషనల్‌ స్పేస్‌ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా ఈ రోజు గుర్తుచేసుకుంటున్నామని, మన శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించే రోజు కూడా ఇదేనని ఎక్స్‌లో పోస్టు చేశారు. అంతరిక్ష రంగంలో భవిష్యత్ ప్రణాళికలపై ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపుతూ ఓ వీడియోను పోస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.