NO Privatization of Singareni Collieries : సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో సింగరేణి ప్రైవేటీకరణ, ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల కొనసాగింపు, ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనే ప్రశ్నలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ప్రశ్నలేవనెత్తారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ బొగ్గు గనిని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదని తేల్చి చెప్పారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలంటే 51 శాతం వాటా ఉన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయమే ప్రధానం అని అన్నారు. సింగరేణిని ప్రైవేటు చేసే వ్యవహారం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ ప్రభుత్వంతో చర్చించి సింగరేణికి ఒక గనిని కేటాయించినట్లు చెప్పారు. సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ ఉండదు - కేంద్రం స్పష్టీకరణ
Published : Jul 24, 2024, 12:42 PM IST